మెదక్ జిల్లా, ప్రతినిధి (సముద్రం న్యూస్):
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెదక్ జిల్లా ఎస్పీ పి.రోహిణి ప్రియదర్శిని ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలుసూచనలు చేయడం అయినది. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండలం యూసఫ్ పేట గ్రామానికి చెందిన వడ్ల సత్యనారాయణ s/o శివ రాములు గారికి గ్రామ శివారులోని 85 సర్వే.నెoలో 36 గుంటల భూమి కలదని అట్టి భూమిలో 15 గుంటల భూమిని సుమారు 12 సంవత్సరాల క్రితం ఎర్పుల కిష్టయ్య s/o రామయ్య గారికి అమ్మినారని, తన ఆరోగ్యం బాగాలేక చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తిరుగుచుండగా అదునుచూసి కిష్టయ్య భూమిని అంతా అక్రమంగా తన పేరు పైకి మార్చుకున్నారని కాని E.C లో మాత్రం 1968 నుండి ఇప్పటివరకి భూమి తన పేరు పైనే చూపిస్తుందని కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని పాపన్నపేట ఎస్.ఐ. గారికి సూచనలు చేయటం జరిగింది. అలాగే సిద్దిపేట పట్టణానికి చెందిన చింతా రాణమ్మ భర్త సంగయ్య గారికి రామాయంపేట మండలం లక్ష్మాపుర్ గ్రామంలో తన తండ్రి నుండి సంక్రమించిన భూమి, సర్వే.నెo 44/5 మరియు 45లో ఎ 1.04 గుంటలు మరియు ఎ.1-16 గుంటల భూమి కాలదని ఇట్టి భూమిని లక్ష్మాపుర్ గ్రామ నివాసులైన 1.సిద్దిరాములు 2.సురేశ్ 3.చంద్రశేఖర్ 4.రుకవ్వ 5.సిద్దయ్య దొంగ దస్తావేజులు సృష్టించి తమ పేరు పైకి పట్టా చేసుకున్నారని వారిని ఎందుకిలా చేశారు అని అడుగగా తనని బెదిరించి భయబ్రాంతులకి గురిచేసారాని,వారితో తన కుటుంబానికి ప్రాణ భయం పొంచివున్నదని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని రామాయంపేట సి.ఐ. గారికి సూచనలు చేయటం జరిగింది. జిల్లా నలుమూలల నుండి పలు ఫిర్యాదుదారులు రావడం జరిగిందన్నారు .