
దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం
ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక
పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం, రాయవరం గ్రామపంచాయతీ చీనేవాండ్ల పల్లిలో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాలు నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామ కంఠం 831 సర్వే నెంబర్లో కొద్దిమేర విలువైన భూములు ఉన్నాయి. ప్రభుత్వ అవసరాల కోసం గ్రామ కంఠంలోని డీకేటి భూములు ప్రభుత్వం ఎప్పుడైనా ఎలాగైనా వాడుకోవచ్చని చట్టం చెబుతుంది. అయితే గత కొద్దిరోజులుగా ఆక్రమనదారులు శరవేగంగా నిర్మాణ పనులు సాగిస్తున్నారు. అయితే ఊర్లోని గ్రామ ప్రజలు నిర్మాణ సమయంలో ఫిర్యాదు చేసిన లెక్కచేయకుండా రూఫ్ లెవెల్ వరకు పనులు సాగించారు.ఈ విషయంపై గ్రామస్తులు కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో అక్రమ నిర్మాణ పనులు నిలుపుదజేయాలని మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే గతవారం పంచాయతీ అధికారులు అక్రమనదారులు ఇంటికి వెళ్లి నోటీసులు జారీచేసిన వారు తిరస్కరించడంతో అధికారులు వారి ఇంటికి గుమ్మానికి నోటీసులు అతికించారు.అయితే గురువారం పంచాయతీ అధికారులను కూడా లెక్క చేయకుండా ఆక్రమణదారులు స్లాబ్ వేసేందుకు సిద్ధమయ్యారు.ఈ విషయం పై పంచాయతీ అధికారులు మీడియా ప్రతినిధులు వివరణ కోరగా ఆక్రమనదారులకు నోటీసులు జారీ చేసిన వారు కట్టడాలు నిలుపుదల చేయలేదని పోలీసు వారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమనదారులపై తగు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో గ్రామంలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఆ ఊరి గ్రామస్తులు కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు ఉదాసినతోనే గ్రామ కంఠంలోని భూములకు రక్షణ లేకుండా పోతుందని చర్చించుకుంటున్నారు.