
జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26
చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు వద్ద నుండి (2) లీటర్లు నాటు సారాయి ను స్వాధీన పరచుకొని అతని పై కేసు నమోదు చేయడమైనది, మరియు ఆ వ్యక్తి కి నాటు సారాయి సరఫరా చేసిన గుంటుపల్లి గ్రామము నకు చెందిన పరసా చిన్నమ్మ అని విచారణ లో తెలియగా సదరు మహిళ పరార్ అవ్వగా, అక్కడ (4) లీటర్లు నాటు సారాయి స్వాధీన పరచుకొని ఆ మహిళ పై పరారీ కేసు నమోదు చేయడమైనది!
మొత్తం గా (6) లీటర్లు నాటు సారాయి స్వాధీన చేసుకున్నా రు.
ఈ దాడులలో స్థానిక చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్. ఐ. అబ్దుల్ ఖలీల్ , జె.జగ్గారావు మరియు సిబ్బంది పాల్గొన్నారని సి.ఐ.పి.అశోక్ తెలిపినారు!