లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

Spread the love

జనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8

ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన ప్రభాకర్ అలియాస్ స్వామి, అలియాస్ చందర్ తో పాటుగా ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా ప్రకటించినారు. మరి కొంతమంది కూడా మృతులైనట్టుగా అధికారులు చెప్తున్నారు. కామ్రేడ్ ప్రభాకర్ చాలా కాలం క్రితం తన జీవిత చరిత్రను తానే రాసుకొని పార్టీకి ఇవ్వడం జరిగింది. దానిని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను జంపన్న)

  • మా గ్రామం ఇస్రోజివాడి, మండలం సదాశివ నగర్, (తెలంగాణ ఏర్పడిన తర్వాత మండలం ఏమైన బదిలీ అయిందా? తెలియదు.), జిల్లా ముందుది నిజామాబాద్. ప్రస్తుత జిల్లా కామారెడ్డి, రాష్ట్రం ముందుది ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత రాష్ట్రం తెలంగాణ

-తల్లి పేరు లోకేటే కిష్టబాయి, తండ్రి పేరు లోకేటి వీరన్న లకు పుట్టిన నలుగురు సంతానంలో నేను 4వ సంతానంగా జన్మించిన చిన్న వాడినీ. నాకంటి ముందుగా పుట్టిన సంతానాల్లో మొదటి సంతానంలో ఒక అక్క

(గంగాబాయి), ఆతర్వాత ఇద్దరు అన్నలు (రాజేశ్వర్ రావు, మానిక్ రావు.) ఉన్నారు.

నా జననం :నేను 1969 సంవత్సరాల్లో (ఒక సంవత్సరం అటుఇటు తేడా ఉండొచ్చు కరక్టు గుర్తు లేదు.) జన్మించాను. నాకు తల్లి,తడ్రులు పెట్టినపేరు లోకేటి చందర్, మా వృత్తి వ్యవసాయం, వర్గం పేద( లో మిడిల్ క్లాస్), కులం ఆరే, చదువు 6వ తరగతి పాస్ అయ్యాను.

-నా వివాహం :- నా తల్లి తండ్రులు 1984 లో సంగోజివాడి గ్రామానికి చెందిన ఆయలా శ్యాంరావు, ఆయలా రాంబాయి దంపతులకు పుట్టినటువంటి నలుగురు కూతుళ్ళలో పెద్ద కూతురు అయినటువంటి సులోచన (మా చిన్న వయసులోనే నాకు 16 సంవత్సరాలు, సులోచనకు 13 సంవత్సరాల వయసు లోనే పెళ్ళి చేశారు. మాకు పెళ్లి అయిన తర్వాత మాకు పుట్టిన ముగ్గురు సంతానంలో ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కాగా, మొదటి కూతురు రజిత 1987లో జన్మించగా, రెండవ కూతురు లావన్య (సంధ్య) 1989లోనూ, చివరి మూడవ సంతానం రమేష్ 1991లో జన్మించాడు. పెద్ద కూతురు రజిత పుట్టుకతోనే వికలాంగురాలు. ఆ అమ్మాయి పుట్టిన 13 సం.రాలకు అంటే 1999లో అనారోగ్యంతో చనిపోయింది.

నా తల్లి, తండ్రుల మరణం: తండ్రి లోకేటి వీరన్న 1996లో (నేను వృత్తి విప్లవకారునిగా విప్లవోద్యమంలోకి

వచ్చిన ఆరు సంవత్సరాలకు) చనిపోయాడు. తల్లి లోకేటి కిష్టాబాయి ఫిబ్రవరి 2022 లో (నేను పార్టీలోకి వచ్చిన తర్వాత 31 సంవత్సరాలకు) చనిపోయింది. నా తల్లి, తండ్రుల మరణ వార్త, వారిరువురి మృత పోటోలతో పాటుగా సైల్ ఫోటోలను కూడా విలేకర మిత్రుల సామాజిక సేవల ధర్మం పలితంగా వారి చివరి చూపును నేను వారు రిలీజ్ చేసిన న్యూస్ పేపర్ లో చూసుకునే అవకాశం లభించింది. నాతల్లి తండ్రులను నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఉద్యమవసరాల రీత్య 1995 లో నేను పుట్టినటువంటి ఊరు ఇస్రోజివాడి గ్రామానికి పోయే అవకాశం దొరికింది. ఆ సందర్భంగా పార్టీ పనుల్లో బాగంగా నా తల్లి తండ్రులను, కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం దొరికింది. అదే వారితో నేను కలుసుకున్నటు వంటి నా చివరికలయికా, అదే వారిని చూసుకున్న చివరి చూపు, తప్ప మళ్ళెప్పుడు వారినీ చూడలేదు. చూసుకునే అవకాశం ఈవర్గపోరాటంలో రగులుతున్న పాశవికమైన జనసంహరణల రక్తపు నిర్భందకాండా ఇవ్వలేకపోయింది.

నాకు పార్టీ తొలి పరిచయం :- 1986లో తొలి పరిచయం అయింది. అతొలిపరిచయంలోనే దళం నన్ను RYL ల్లో చేర్చుకోవడమే కాకా ఆ RYL కు నన్నే అధ్యక్షునిగా (అయితే నాకు దళం పరిచాయం కాక 2 సంవత్సరాల ముందునుండే మాఊర్లో అప్పటికే పనిచేస్తున్న RYL గైడెన్స్ లో వాల్లతో నేను అన్ని కార్యక్రమాల్లో అనాదికార సంఘంంగా పాల్గొంటూ పనిచేస్తున్నాను.) పెట్టింది. అలా నేను 1986 నుడి 1987 వరకు గ్రామ RYL అధ్యక్షునిగాను, 1988 నుండి 1991 ఏప్రిల్ వరకు గ్రామ Ry) అధ్యక్షునిగా పని చేస్తూనే ఏరియా RYL సభ్యునిగాను పని చేశాను.

1986లో నేను RYL లో చేరినప్పటినుండి 1991 ఏప్రిల్ వరకు సంఘంలో నేను చేపట్టినటువంటి కార్యాక్రమాలు కిందివి..—

నేను ఏరియా RYL ల్లో ఉండగా గ్రామ, ఏరియా వ్యాప్తంగానూ పార్టీ తీసుకున్న ప్రతి ప్రజాందోళనల్లోకి ప్రజలను ఆర్గనేజ్ చేయడం. మాఊర్లో ఉన్న ముగ్గురు భూస్వాములు (రాజేశ్వర్ రావు మాలీస్ పటేల్, చిన్న రాజిరెడ్డి, నారయన్ రావు పోలీస్ పటీల్) ఎస్.సి, ఎస్.టి దళిత, పీడిత్ ప్రజలకు చెందాల్సిన పదంపోగు భూములను ఆక్రమించుకొని సాగుచేస్తుండగా ప్రజలను ఏకంచేసి భూస్వాములు ఆక్రమించుకున్న భూములను గుంజి ప్రజలకు పంపిణీ చేశాము.

భూస్వాములు వారిపంటపోలాల్లోకి పోవడానికై దారులు లేకుంటే, లేదా ఇరుకుగా ఉన్నాయనే పేరుతో వారి అధికార బలంతో ప్రజల పంటభూముల నుండి ఎంత పెద్దగా నైనా రోడ్లను, దార్లను వేసుకున్నారు. కానీ ప్రజలు తమ పంటపోలాల వద్దకు పోవడానికై తమను, తమ పశువులను భూస్వాముల భూముల్లో నుండి దార్లను ఇవ్వకుండా ప్రజాకంటకులుగా మారినటువంటి ఆముగ్గురి భూస్వాలకు వ్యతిరేకంగా ప్రజల్ని ఎకం చేసి భూస్వాముల మెడలు వంచి భూస్వాముల భూముల్లో నుండి ప్రజలకు దార్లను తీయించాము.

వ్యవసాయ కూలీపోరాటాలు, పాలేర్ల జీతాల పెంపుకై పోరాటాలు, రైతులకు తమ పంటలకు గిట్టుబాటు ధరలకై, 24 గంటలు విద్యుత్ సౌకార్యానికై పోరాటాలు.

సారా వ్యతిరేక పోరాటాల జై. తాలుకా, జిల్లా లేవాల్లో పార్టీతీసుకున్న పోగ్రాంలకు ప్రజల్నీ ఆర్గనేజ్ చేస్తూ ప్రజాపోరాటాల్నీ చేపట్టాము.

1990 లో వరద బాదితులకు సహాయంగానూ చందా వసూళ్లకై పార్టీ తీసుకున్న పోగ్రాంను తీసుకొని తాలూకా సెంటర్. అయినటువంటి కామారెడ్డిలో ప్రతి వ్యాపారుస్థుని వద్దకు వెళ్ళి వారిని ఆర్గనేజ్ చేస్తూ లక్షలాది డబ్బుల్ని చందా వసులు చేసి వరద బాధితులకు పంపించాము.

పార్టీ తీసుకున్న ప్రతి ప్రచారాందోళనల్లోనూ పోస్టర్స్, బ్యానర్లు, కరపత్రాల్నీ ఆయా గ్రామాల్లోనే కాకుండా, తాలూకా సెంటర్ అయినటువంటి కామారెడ్డిలోని ప్రతి ముఖ్యమైన రోడ్లగుండా వేసేది, కట్టేది. పాంప్లెంట్స్ అయితే సినిమాహాల్స్ ల్లోకి వెళ్ళీకూడా సినిమా హాల్లోని ప్రజలకు కూడా పంపినిచేసి వచ్చేది. సినీమా హాల్ వద్ద రక్షణ బాధ్యతల్నీ నిర్వర్తిస్తుండినటువంటి గోరవ్యక్తినీ మాకంట్రోల్లో పెట్టుకొంటు ఆకరపత్రాల్ని పంపినీ చేసివచ్చేది. కామారెడ్డి తైసిల్ సెంటర్ లో ప్రతి పార్టీ దినోత్సవాల సందర్భంగా ప్రచార పోగ్రాంను నిర్వహించడానికై మా ఏరియా RYL తో పాటుగా అదనంగా ఆయా గ్రామాల నుండి 60-70 మంది వివిద నిర్మాణాలకు చెందిన కార్యకర్తలను తీసుకపోయి బ్యాచీలుగా డివైడ్ అయ్యి ఈపోగ్రాలను చేపట్టేది. మాకు రక్షణ రీత్య పార్టీ ఇచ్చిన గ్రేనేడ్స్ ప్రతి RYL కార్యవర్గ కార్యకర్తవద్ద ఉండేవి. ప్రతి పార్టీ దినోత్సవాల సందర్భంగా మేము ప్రచారసాహిత్యాన్ని కామారెడ్డి తైసిల్ సెంటర్ లో వెస్తున్నదాన్ని శతృవు దృష్టిలో పెట్టుకొని, ఒక సారి వాడు మేము తప్పకుండా పోస్టర్స్, బ్యానర్స్ వేస్తారనుకునే ధాన్యం వ్యాపార (గంజి ) మార్కేట్ సెంటర్ లో వాడు ఆంబూష్ కూర్చోనీ మా బ్యాచిపైనా ఫైరింగ్ చేశాడు. కానీ ఎవరికీ ఎమి కాకుండా రిట్రీట్ అయ్యి వచ్చాము. ప్రతి పార్టీదినోత్సవాల సందర్భంగా గ్రామప్రజలందరినీ పిలుస్తూ జండ ఎగరవేస్తూ, పార్టీ సందేశాన్ని ఇచ్చేది.

ప్రజా పంచాయితీలను భూస్వాములు గ్రామపెత్తన్ దార్లు తమ ఇష్టరాజ్యంగా పక్షపాతంతో నిర్వహిస్తూ, ములిగెనక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రజల ఆర్ధిక స్థోమతను లెక్కలోకి తీసుకోకుండా తినడం, త్రాగడంకై విచ్చలవిడిగ దండగలు వేసేటువంటి ఈ దుష్టశక్తుల పెత్తనాన్ని కట్టడు చేసి ప్రజల సమస్యలను పార్టీ పద్ధతుల్లో ప్రజాస్వామ్య యుతంగానూ, పక్షపాతరహితంగానూ, ఎన్నో పంచాయితీలను నిర్వహించాము.

1990లో చెన్నారెడ్డి హాయంలో దొరికిన లీగల్ పీరియడ్ లో పార్టీ తీసుకున్న ప్రజామీటింగ్ లు హైద్రాబాద్, వరంగల్ మీటింగ్ లకు వాలంటరీలుగా బాధ్యతల్నీ నిర్వహించడానికై పార్టీ సెలెక్టుచేసిన దాంట్లో నేను కూడా ఒకనిగా వెళ్లి వాలంటరిగా నావంతు కర్తవ్యాన్ని నిర్వహించాను.

ఇలా మాయొక్క RYL విప్లవా కార్యక్రమాలు చురుగ్గా కొనసాగడంతో దోపిడి వర్గాలయినటు వంటి భూస్వాములకు, గవర్ణమెంట్ కు కంటగింపయ్యింది, కాళ్లకిందున్న దుమ్ము కంట్లో పడ్డట్టయ్యింది. దీంతో మాఊరు భూస్వాములు ప్రభుత్వం ఒకటయ్యి మా సంఘాన్ని టార్గెట్ చేసి పలుమార్లు మాసంఘం వాల్లా ఇండ్లపైనా, RYL అధ్యక్షునిగా నేనే కాబట్టీ నన్ను మేన్ గా టార్గెట్ చేస్తూ మాఇంటిపైన దాడిచేస్తూ ఇంటిలో ఉన్న ఆకాస్త తిండిగింజలతో పాటుగా సామనింటిని ధ్వంసం చేశారు. నేను దొరకక పోవడంతో మాతల్లి, తండ్రులను, నాబార్యను కొంటడం, నన్ను సరెండర్ కోసం తీసుకరావాలనీ వేదించే వారు. అయినప్పటికీ మాకుటుంబం నన్ను సరెండర్ కావాలనే ప్రయత్నం కానీ నాపైన ఒత్తిడి కానీ చేయలేదు. మరియు నేనుకూడా శతృవుకు దొరకకుండా గెరిల్లా జీవితానికి మోల్డయ్యి కుటుంబ పనులను పూర్తిగానే వదిలిపెట్టి మొత్తం పార్టీపనులకే ప్రాముఖ్యతనిస్తూ మరింత క్రియశీల విప్లవకార్యకలాపాల్లోకి దిగాను.

మాసంఘ కార్యక్రమాలు దినదినం మరింత క్రియశీలంగా మారడంతో పిచ్చెక్కి పోయిన గ్రామ భూస్వాములు మా సంఘాన్ని, నన్ను మరో కొత్త ఎత్తుగడతో లొంగతీసుకోవాలి అనుకున్నారు. కొత్తరూపంలో లొంగదీసుకోవాలనకున్న ఎత్తుగడ ఏమనగా పెద్ద మొత్తంలో శతృబలగాలతో మాగ్రామాన్ని చుట్టుముట్టించి ప్రజలెవ్వరినీ బయటకెల్లకుండా నిర్బందించి పిల్లా,పిసక, ముసలి, ముతక అనే తేడా లేకుండా దొరికినోళ్లను దొరికినట్టు పట్టుకొని వాహానాల్లో పోలీస్ క్యాంపుకు తరలించి స్టేషన్ లోనే బందించి పెట్టాలి. బందించిపెట్టిన ప్రజలను వదలాలంటే ప్రజలు చేయాల్సిన పస్టు పనీ ప్రజలంత కలిసి నన్ను సరెండర్ కు తీసుకరావాలీ, లేదా గ్రామాన్ని వదిలీ పార్టీలోకైనా వెల్లేలా వత్తిడి చేయాలీ. ఇవి రెండిట్లో ఎదోఒకటి చేసి తీరెంత వరకు పోలీస్ క్యాంపులో బందించి పెట్టిన మీ కుటుంబీకులను వదిలేది లేదనే షరతుల్ని పెట్టడం ద్వారా ప్రజల వత్తిడితోనే భూస్వాములు నన్ను లొంగదీసుకోవచ్చనీ అనుకున్నారు. ఈవిదంగా భూస్వాములు పన్నిన ఎత్తుగడల్లో భాగంగానే (1989 లో అనుకుంటాను సరిగ్గా గుర్తులేదు) పెద్ద మొత్తంలో శతృబలగాలు ఎన్నో వాహానాల్లో రాత్రికి రాత్రే వచ్చి (300 కు పైబడి కుటుంబాలు కలిగిన) మాగ్రామాన్ని చుట్టుముట్టి, తేల్లవారు జమున ప్రజల్నేవ్వరినీ బయటకు కాలకృత్యాలకు కూడా పోనివ్వకుండా నిర్బందించి దొరికినోళ్లను దొరికినట్ల వయోబేదం లేకుండా వందకు పైబడిన ప్రజల్ని పట్టుకొనిపోయి కామారెడ్డి పోలీసు స్టేషన్ లో బందించారు. పోలీస్ స్టేషన్ లో బందించబడియున్న ప్రజల విడుదలకై తమ కుటుంబీకులతో పాటు మరికొంతమంది స్టేషన్ కు పోగా శతృవు ప్రజలకు పెట్టిన డిమాండ్ మాసంఘాన్ని, మేన్ గా నన్ను ప్రజలంత కలిసి సరెండర్ కు తీసుకొని రావాలి లేదా గ్రామాన్ని వదిలిపెట్టి పార్టీలోకైనా పోయేలా చేయాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చేస్తేనే అరెస్ట్ చేసితెచ్చిన మీకుటుంబీకులను వదుతాము లేనిచో వదలమని డిమాండ్ పెట్టగా, సాయుధంగా ఉన్న శతృవుతో ముఖాముఖి ప్రస్నిస్తూ తలపడలేనీ ప్రజలు తమ కుటుంబీకుల విడుదలకై వెళ్ళిన ప్రజలంత చేసేదేమి లేక గ్రామానికి తిరిగొచ్చి శతృవు పెట్టిన డిమాండ్ ను అనుసరిస్తూ వందలాది మంది ప్రజలంత నాఇంటిముందుకు ఏడుపులు తూడుపులతో ఒక దర్భలాగా వచ్చి ప్రొద్దున్నె 7-8 గంటలకే నాఇంటి ముందు ఒక దర్శలాగా వచ్చి కూర్చున్నారు. కానీ ఆసమయంలో నేను ఇంటివద్ద లేను. ( నేను కానీ, మా సంఘం వాల్లు కానీ శతృవు మమ్మల్ని టార్గెట్ చేశాడనేది అప్పటికే మాకు అర్థమైంది కాబట్టి మేమెప్పుడు కూడా ఇంటివద్ద పడుకోకుండా ఏనాటినుంచో గెరిల్లా జిందగికి అలవాటు పడి ఊరు బయటనే పంట చేల్లలో రోజుకో దిశలో పైప్ మైన్ను పెట్టుకొని పడుకొంటూ, ప్రొద్దున 8-9 గంటలకు ఊర్లోకి వచ్చేవారం.) ప్రొద్దున 8-9 గంటల సమయానికి నేను ఇంటికి వచ్చే వరకు వందలాదిమంది ప్రజలు మాఇంటి ముందు కూర్చుండి. ఏడుపులు, తూడుపులను చూసి ఏమైందో అర్ధం కాలేదు. ఇంటి దర్వాజలోకి చేరుకోగానే ప్రజలంత ఒక్కసారీ లేస్తూ ఏడుపులు, తూడుపులతో నాకాళ్లా వెల్లపడుతూ శతృవు భోదించి పంపిన విశయాన్నంత చెప్తూ నన్ను సరెండరయినా కావాలి. లేదా పార్టీలోకి అయినా పోతేనే మా పిల్లా పిసక అనే తేడా లేకుండా శతృవు అరెస్టు చేసి తీసుకెళ్లినా కుటుంబీకులను శతృవు విడుస్తాడనీ, లేకపోతే పోలీస్టేషన్ లోనే చనిపోతారనీ ప్రజలు ఏడుస్తూ తమ ఆవేదనను చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడు నాకు స్పష్టంగా అర్థమైందేమనగా శతృవు గ్రామంపై చేసిన దాడులకు, ప్రజల అరెస్టులకు, తమ కుటుంబికులు అరెస్టుల వల్లా ప్రజలు పడుతున్న ఆవేదనకు గల కాణం ఈభూస్వాములే తప్ప మరొక కారణం ఎంతమాత్రం కాదనేది అర్థమైంది. ప్రజలకు సేవ చేశామే తప్ప కీడు చేయనీ మాసంఘాన్ని నేడు ప్రజలు సరెండర్ కావాలనే డిమాండ్ ను ఎందుకు చేస్తారూ? చేయరు. ప్రత్యక్షంగ ప్రజలనోట ఆరోజు నన్ను సరెండర్ కావాలనే డిమాండ్ పరోక్షంగా అది వర్గశతృవులయిన భూస్వాములు పెడుతున్న డిమాండ్సే తప్ప మరేమి కాదనేది అర్థమైంది. సరే నేను ముందుగా చేయాల్సిన పని, ప్రజలంత నాఇంటిముందుకు వచ్చి ఏడుస్తున్నారు. కాబట్టి మా సంఘం తరపునా అద్యక్షునిగా నేను ప్రజలు నాముందుంచిన దానికి మేము సరెండర్ అవుతామా? లేక పార్టీలోకే పోతామా అనేది క్లీయేర్ చేయాల్సిన ప్రధాన సమస్య ముందుకొచ్చింది. కాబట్టి. నేను నాఇంటిముందుకు ఏడ్పులతో వచ్చిన ప్రజలను ఓదార్చుతూ ఆప్రజలతో సరే మేము సరెండర్ అవుతామా? లేక పార్టీలోకే పోతామా అనే విషయాన్ని మాసంఘం వాల్లందరం ఆలోచించి మీకు క్లియర్ చేస్తాము కాబట్టి గ్రామపంచాయితీ వద్ద గ్రామప్రజలందరు జమకమ్మని చెప్పి పంపించాను. ఆతర్వాత మాసంఘం వాలందరం కలిసి మాట్లాడుకొని సంఘం అనుకున్న విషయాన్ని గ్రామపంచయితీ భవనం వద్ద జమయి ఉన్న ప్రజలతో మేము మాట్లాడతూ

మమ్మల్నీ మీరు సరెండర్ కమ్మనీ, లేదా పార్టీలోకైనా పోవాలనే డిమాండ్ చేస్తున్నారు. సరె మీ అభిప్రాయాన్నీ

మేము గౌరవిస్తాము. కానీ మేము శతృవు ముందు ఎందుకు సరెండర్ కావాలో? మాసంఘం చేసిన నేరమేమిటో చెప్తే మేము ఆలోచిస్తామనీ మేము ప్రజలకే ప్రశ్న వేస్తూనే, (అక్కడె ఆప్రజామీటింగ్ లోనే కూర్చోని యున్న భూస్వాముల ముందు మాసంఘం ప్రజలకు వేసే ప్రశ్నలకు ప్రజలు దైర్యంతో జవాబు చెప్పే చైతన్యం అప్పటికి ఇంక ప్రజలకు రాలేదనే విషయాన్ని మేము అర్ధం చేసుకొని) ఆప్రశ్నలకు మేమే జవాబుల్ని ప్రజల ముందుంచినటువంటివీ,

మా సంఘం భూస్వాముల భూములను గుంజి భూమీ లేనీ ప్రజలకు పంపినీ చేసింది మా సంఘం చేసింది. నేరమా? > ప్రజల పంటపోలాల్లోకి వెల్లడానికై దారులు లేకపోతే భూస్వాముల మెడలు వంచి వారి భూములనుండి ప్రజలకు దారులను తీయించింది మాసంఘం చేసిన నేరమా? వ్వసాయ కూలీలకు, పాలేర్లకు వారికి శ్రమార్జితంగా ప్రతిఫలం దక్కాలనీ వారికి కూలీ, జీతాల్ని పెంచింది మాసంఘం చేసిన నేరమా? ప్రజలకు పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధరలను కల్పించాలనీ ప్రజల్నీ ఏకం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాపోరాటాల్ని చేపట్టింది మా సంఘం చేసిన పనీ నేరనూ? ఇలాంటి వెన్నో ప్రజసేవకై మాసంఘం చేసిన పనుల పాపాల నేరానికి మేము శతృవుకు సరెండర్ అవ్వల్నా అని ప్రజలను పశ్నిస్తూనే లేదు. మాప్రజలెవరికీ మాసంఘం ప్రజావ్యతిరేకమైన పనులు చేస్తుందనీ ఎవరనుకోరూ.. మాప్రజలకు మాసఘం పైనా ఉన్న వ్యతిరేకతతోనో, కోపంతోనో నేడు మాసంఘాన్ని శతృవు ముందు సరెండర్ కమ్మనీ అనడం లేదూ. అనరూ. వారిపైన పోలీసు బలగాలతో దాడులు చేయించి, అరెస్టులు చేయించి పోలీస్టేషన్ లో బందింప చేసి, ప్రజలను నానా రకాలుగా వేదించి, ఆవేదనకు గురిచేసినటువంటి ఈ ఊరు భూస్వాముల (రాజేశ్వర్ రావు మాలీ పటేల్, నారయణ్ రావు పోలీస్ పటేల్, చిన్న రాజిరెడ్డి) ఆగడాల కారణంగా ప్రజలు తట్టుకోలేని పరిస్థితిని ముందుకు తేవడం ద్వారా, ప్రజలు గత్యంతరం లేని పరిస్థితిలో మాసంఘాన్ని సరెండర్ కమ్మనీ నేడు మాసంఘాన్ని ప్రజలు కోరుకునే దానికి, వారి ఆవేదనకు గల భౌతిక పునాది ఈభూస్వాములే తప్ప మరెవరు కాదు. కాబట్టి అరేస్టయ్యి పోలీస్టేషన్ లో బందించబడి యున్న ప్రజలందరినీ 24 గంటల్లోపు పోలీస్టేషన్ నుండి విడిపించుకొని రానట్లయితే ప్రతి భూస్వామీ కుటుంభంలోని ఈ డ్రామకంతటికీ ప్రదానకారకులైన వారినీ హతమార్చి, మొత్తం భూస్వామ్య కుటుంబీకులు అందరు కట్టు బట్టలతో ఇళ్లు విడిచి పోవాల్సి వుంటదనీ ఆమీటింగ్ లోనే కూర్చోని ఉన్న భూస్వాములను ముందుకు పిలిచి హెచ్చరిక చేయగా, భూస్వామ్య కుటుంభాలంత లబోదిబో మొత్తుకుంటు మాసంఘం కాళ్లావేల్ల పడుతు అరెస్టు అయినవారినీ తీసుకొస్తామనీ ప్రజలముందూ హామి పడీ వెళ్ళీ 24 గంటలు గడవకముందే అరెస్టయి ఉన్న ప్రజలను విడిపించుకొని వచ్చారు. అప్పటి నుండి ప్రజలకు మాసంఘం పైన మరింత విస్వాసం పెరుగగా, వర్గశతృవులపై మరింత కసి పెంపొందింది.

నేను పార్టీలోకి పూర్తికాలం విప్లవకారునిగా 1991 ఏప్రిల్లో భర్తీ అయిన నాటి నుండి 2024 మే వరకు నేను వివిద ప్రాంతాల్లో పని చేస్తూ వచ్చిన వివరాలు. కింద పేర్కొనబడినవి:

  • ఏప్రిల్ 1991 లో పార్టీలోకి వృత్తి విప్లవకారునిగా భర్తీ అయ్యాను.

ఏప్రిల్ 1991 లో భర్థి అయిన నుండి జూన్ వరకు 3నెలలు కామారెడ్డి (లోకల్) ఎరియా దళంలో పనిచేశాను.

  • జూలై 1991 లో సిర్నపల్లి ఏరియాకు ఉధ్యమవసరాల రీత్య పార్టీ బదిలీ చేయగా, అప్పటి నుడి 1998 చివరి వరకు సిర్నపల్లి ఏరియా దళంలో పార్టీ సభ్యునిగా, కమాండర్ (AC-m), డివిజన్ కమీటీ మెంబర్ గా ఉంటూ బాధ్యతల్ని నిర్వర్థించాను.
  • 1999 నుండి 2000 చివరి వరకు నేను Dvcm గా ఉంటూ కామారెడ్డి ఏరియాకు ఇన్చార్జి గానూ, మరియు ఆఏరియాకు ACS గానూ పనిచేశాను..

2000 చివరనుండి 2003 అక్టోబర్ నవంబర్ వరకు సిరిసిల్లా ఏరియాకు ఇన్చార్జి Dvc-m గా వుంటూ ఆఏరియా
ఉద్యమాన్ని గైడ్ చేశాను.

** అలాగే 1996 నుండి 2003 వరకు నిజామాబాద్ జిల్లాలో Dvc-m గా మాస్ వర్కుతో పాటుగా, మిల్ట్రీ బాధ్యతల్ని కూడా పార్టీ నాకివ్వగా పార్టీ నాకిచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించాను.

-2003 లో తెలంగాణ ప్లేనంలో తెలంగాణ నుండి కొంత మంది క్యాడర్ ను డికె కు రిట్రీట్ చేయాలనీ పార్టీ తీసుకున్న నిర్నయంలో బాగంగా నేను డిసెంబర్ 2003 లో డీకేకు వచ్చాను.

డిసెంబర్ 2003 నుండి 2011 నవంబర్ వరకు దక్షిణ్ సబ్ జోనల్ బ్యూరో లోనీ పశ్చిమ్ బస్తర్ లో Dvc-m గానూ, ఆతర్వాత 2005 నుండి కంపనీ 2 కమాండర్ గానూ, సబీవ్ గానూ, దక్షిణ్ సబ్ జోనల్ కమాండ్ మెంబర్ గానూ, దక్షణ్ సబ్ జోనల్ బ్యూరో మెంబర్ గానూ పని చేశాను. 2006లో జరిగిన డి.కె కాన్ఫరెన్స్ లో నన్ను Szc లోకి తీసుకున్నారు.

2011 నవంబర్ లో ఉద్యమవసరాల రీత్య దక్షిణ్ సబ్ జోన్ నుండి పశ్చిమ్ సబ్ జోన్కు నన్ను బదిలీ చేయాలనీ Szc తీసుకున్న తీర్మాణంలో భాగంగా నేనూ బదిలి అయ్యి పశ్చిమ్ సబ్ జోన్కు వచ్చాను.

నవంబర్ 2011 లో పశ్చిమ్ సబ్ జోన్ కు బదిలయ్యి వచ్చిన నుండి 2020 వరకు ఇక్కడ సబ్ జోనల్ బ్యూరో మెంబర్ గానూ, పశ్శిమ్ సబ్ జోనల్ కమాండర్ ఇన్ చీఫ్ గానూ, కంపనీ 10 కు సచీవ్ గానూ, కంపనీ 4 కు సచీవ్ గానూ, ఉత్తర్ గడ్చిరోలి డివిజన్ కు సబ్ జోనల్ బ్యూరో నుండి ఇన్ చార్జిగానూ పనిచేస్తు 2019 లో అప్పటి వరకు పశ్చిమ్ సబ్ జోన్ ప్రభారిగా ఉండిన కా. నర్మదక్క అనారోగ్యం రీత్య బయట ట్రీట్ మెంట్ కు వెల్లి అరెస్టు అం తర్వాత 2020 లో పార్టీ నాకు పశ్చిమ్ సబ్ జోనల్ ప్రభారిగా బాధ్యతలు ఇవ్వడంతో 2020 నుండి 2024 పశ్చిమ్ సబ్ జోనల్ బ్యూరో ప్రభారిగా ఉంటూ పని చేస్తున్నాను.

నేను 1991 ఏప్రిల్ లో పార్టీలోకి వచ్చిన నాటి నుండి 2024 నవంబర్ వరకు శతృవుపై మనం చేసిన దాడుల్లొ నేను పాల్గొన్న రేయిడ్స్ కిందివి

1) వ రేయిడ్ :- 1993 లో నిజామాబాద్ జిల్లా, డిచ్ పల్లి మండల్, సిర్నపల్లి రైల్వేస్టేషన్ లో శతృవు నెలకొల్పిన పోలీస్ అవుట్ పోస్ట్ పై ( శత్సవు సంఖ్య 20-25 మంది, మనం 35-40 వరకు ఉన్నాము) చేసిన దాడి సఫలతలో నేను ఒక్కోన్ని, ఆ దాడిలో నేను అస్సాల్ట్ బ్యాచిలో పాల్గొన్నాను. అందులో 5-6 గురు పోలీసులు చావగా, మిగతవారందరి సరెండర్ చేసుకొన్నాము. ఈ రేయిడ్ లో దాదాపు ఒక 20 వరకు శతృవుకు సంబందించిన సెమీ, ఆటో వెపన్స్ తో పాటుగా తూటాల్ని కొన్ని గ్రెనెడ్స్ ను స్వాధీనం చేసుకున్నాం.

2) వ రేయిడ్ :- 1999 లో అనుకుంటాను. మెదక్ జిల్లా పాపన్నపేట మండల్ సెంటర్ లో నున్న పోలీస్ స్టేషన్ పైనా చేసిన దాడి సఫలతలో పాల్గొన్నాను. ఆ స్టేషన్ మన ఉద్యమ ప్రాంతానికి 60-70 కి. మీటర్ల దూరంలో ఉన్నందున, ఆ పోలీస్ స్టేషన్ దాడికొరకు మనం వాహానాల్ని ఉపయోగించి దాడి చేశాము. ఆ రేయిడ్ ను పస్టుగా హ్యటాక్ చేయాలనుకున్న అసాల్ట్ (5గురితో కూడిన) బ్యాచికి కమాండర్ గా నేనే ఉన్నాను. ఆరేయిడ్ ప్లానింగ్ లో నిర్నయించుకున్న ప్లాన్ ప్రకారం ఒక ఫోర్ విల్లర్ జిఫ్సీలో ఈ5 గురితో కూడిన అస్సాల్ట్ బ్యాచీ టోటల్ రేయిడ్ పార్టీ సెట్ అయిన వెంటనే టోటల్ కమాండర్ కాషన్ తో ఈ అస్సాల్ట్ బ్యాచీ పోర్ విల్లర్ జిప్స్ లో డైరెక్టు పోలీస్టేషన్ గేట్ గుండా లోపలికి దూసుకపోయి దాడి చేశాము. ఈరేయిడ్ విజయవంతమైంది. ఈదాడిలో మనకు ఒక 20 వరకు వెపన్స్ కొన్ని గ్రేనెడ్స్ ను స్వాదీనం చేసుకున్నాము. ఈదాడిలో ముగ్గురు నలగురు వరకు పోలీసులు చనిపోగా మిగిలిన వారిని సరెండర్ చేసుకొని దాడి సక్సస్ చేసుకున్న దాంట్లో నేను ఒక్కోన్నీ, ఇందులో మనకు ప్రాణాపాయము ఏమి జరగకుడా సక్సస్ చేసుకున్నాము.
3) వ రేయిడ్ :- ఇది విఫలమైన రేయిడ్. ఇది 1998 లో అనుకుంటాను. నిజామాబాద్ జిల్లా, సదాశివన్ నగర్ మండల్,రామారెడ్డి అనే గ్రామంలో శతృవు నెలకొల్పిన ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పై (శతృబలగాలు దాదాపు 150 వరకుంటారు.) మూడు డైరెక్షనల్ మైన్లను ఒక్కో మైన్ లో దాదాపు ఒక క్వింటల్ జల్టిన్, ఒక్కో బాల్ 10 కిలోల వేటుతో ఉన్నటువంటి వాటినీ ఒక్కోదాంట్లో 10-15 బాల్స్ ను అమర్చి వాటిని క్రేన్లతో ఒక ట్రక్కులో అమర్చి, వాహానాన్నీ తీసుకెల్లి (క్యాంపు ముందు నుండె రోడ్డు ఉంది కాబట్టి) క్యాంపు ముందు వాహనాన్ని నిలిపివేసి డ్రైవర్ వాహానం నుండి జంప్ చేసి వస్తున్నప్పుడు డైరెక్షనల్ మైన్ కు అమర్చిన టైం బాంబు కనెక్షన్సు ఆన్ చేసి రావాలనుకున్నాం.అలాగే అది ఏదేనీ పరిస్థితిలో అటైం బాంబును ఆ డ్రైవర్ ఆన్ చేసి రాకపోతే ఆల్టర్ నేట్ గా అలాగే రిమోట్ తో పేల్చడానికై ప్లాన్ చేసుకొని రేయిడ్ కు వెళ్ళిన రేయిడింగ్ పార్టీలో నేను ఒక్కోన్ని, కానీ ఆ డ్రైవర్ ఆన్ చేసి రావాలనుకున్నా టైం బాంబు స్విచ్ ను ఆన్ చేయకపోవడంతోనూ, మరియు ఆల్టర్ నేట్ రిమోట్ ను ఉపయోగిద్దామనుకున్న రిమోట్ పనిచేయక పోవడంతో ఆరెయిడ్ పియిల్ అయింది. రెండు వైపుల కొన్ని రౌండ్స్ పైరింగ్ జరిగింది. కానీ ఆరేయిడ్ సపల్ కాలేదు.

4) వ రేయిడ్ :- ఛత్తీస్ గడ్ రాష్ట్రం, దంతేవాడ జిల్లా, కుంటా తాలూకా ఎర్రబోర్ లో శతృవు ఏర్పర్చిన సల్వాజుడు: పోలీస్ శిబిర్ పై రేయిడ్ చేసి అక్కడున్న SRP, CRPF బలగాలను క్యాంపు నుండి బయటకు వెల్లకుండా అడ్డుకొని, సల్వాజుడుంకు చెందిన 35 మందికి పైగా గుండాలను చంపిన దాంట్లో నేనొకడిని.

5) వ రేయిడ్ :- 2006 లో చత్తీష్ గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, ముర్కినార్ గ్రామం లో శతృవు నెలకొల్పిన పోలీస్ అవుట్ పోస్ట్ పై బస్సులో వెల్లి చేసిన రేయిడింగ్ పార్టీలో నేను ఒక అస్సాల్ట్ బ్యాచీకి కమాండర్ గా వుండీ ఆ రేయిడ్ విజయవంతానికై నావంతు పాత్రను నేను నిర్వహించాను.

6) వ రేయిడ్ :- 2007లో, ఛత్తీష్ గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, రాణి బోదిల్ గ్రామంలో సల్వాజుడుం సమయంలో శతృవు నెలకొల్పిన పోలీస్ అవుట్ పోస్ట్ పై చేసిన రేయిడ్. ఈ రేయిడ్ కు టోటల్ కమాండర్ గా నేనే నాయకత్వాన్ని చేపట్టి ఆరేయిడ్ విజయవంతానికి అందులో నావంతు పాత్రను నిర్వర్ణించాను. ఆరేయిడ్ లో 57 మంది (18మంది. SRPజవాన్లు, 39 మంది SPO లు చనిపోగా, దాదాపు ఒక 30 ఆయుదాలు, కొన్ని గ్రెనెడ్లు, బుల్లెట్ పూఫ్ జాకేట్స్ స్వాధీనం చేసుకొన్నాము. ఈరేయిడ్ లో మనం నలుగురు కామ్రేడ్స్ ను కోల్పోయాము.

నేను ప్రత్యక్షంగా పాల్గొన్న అంబూష్ లకు సంబందించిన వివరాలు:-

1)1998 లో కరీమ్ నగర్ జిల్లా, చందుర్తి మండలం వద్ద ఆ మండల పోలీస్టేషన్ కు చెందిన ప్రజాకంఠ కరుడుగట్టిన Si నీ టార్గెట్ చేసి నిర్వహించిన రోడ్డు అంబూష్ కోసం (ల్యాండ్ మైన్ తో) ముగ్గురితో కూడి టింకు నేనే కమాండర్ బాధ్యతను చేపట్టి చేసిన అంబూష్ లో ఆ కరుడుగట్టిన Si చావగా, మిగత 5-6 పోలీ.. గాయాలయ్యారు. మరి కొంతమంది పోలీసులకు ఏమికాకుండా ప్రతిగటించడం వల్ల మనం వెపన్స్ ను సీజ్ చేసుకోలేక పోయాము.

2)2000 ల సం,,రంలో కరీంనగర్ జిల్లా, కోనరావు పేట మండల్ పోలీస్టేషన్ కు చెందిన పోలీస్ పార్టీకు, ఆస్టేషన్ అవుటర్ చెర్చింగ్ కై ఎగ్లాస్ పూర్ అనే గ్రామానికి ఉదయమే 7 గం.లకు చేరుకొంది. శతృవు ఆగ్రామానికి వచ్చాడనే రీపోర్టు మనకు మన సంఘం, ప్రజల సహాకారంతో మనకు తెలువడంతో, శతృవుకు సంబందించిన మరిన్ని వివరాల్ని
సేకరించుకొని (శతృవు బలగాలు 60-70 వరకు) మన 9 మందితో కూడిన దళంతో (ఈ ఆంబూష్ పార్టీకి నేనే కమాండర్ ను) శతృవు వెళ్తాడనె రూట్ లో అంబూష్ చేయగా ఆ అంబూష్ లో Si చావగా, మిగత బలగాలు దాడిలో వారి సమన్వయం ఎగిరిపోయి రెండు మూడు బ్యాచీలుగా విడిపోయిన బలగాలలో ఒక టీం జంగల్లో తప్పిపోయి దాడిజరిగిన రెండవరోజుకు కానీ క్యాంపుకు చేరుకోలేదు.

3) 2005 సల్వజుడుమ్ సమయంలో ఛత్తీష్ గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, కొర్సెల్- డువ్వల్ నేంద్ర గ్రామాల మధ్యలో శతృబలగాలు మకాం వేయగా రాత్రి 8-9 గంటల సమయంలో ఒకరిద్దరు మీలీశీయ కామ్రేడ్స్ ను పట్టుకొని వెళ్లి శతృమకాం పై దాడి చేసి ఇద్దరు జవాన్లు గాయపర్చిన దాంట్లో నేనే ఆటీంకు కమాండర్ గా ఉన్నాను.

4) 2006 లో బెల్లం నేండ్రా- మన్కెల్ మద్య జంగల్లో కంపెనీ 2 బలగాల తో పాటుగా సెకండరీ బలగాలు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆంబూష్ లో ఇద్దరు SPO లు చావగా ఒకరిద్దరు జవాన్లు గాయాలయ్యారు. ఈ ఆంబూష్ లో నేనె కంపనీ 2 కమాండర్గా వున్నాను.

5) 2006 లో ఛత్తీష్ గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, పిడియా లో శతృబలగాలు రెండువందలకు పైగా మొహరించి 3-4 రోజులగా మకాం వేసి ఉండగా, మకాం వేసి ఉన్న ఆబలగాలకు రక్షణ ఏర్పట్లతో పాటుగా, ఆబలగాలకు తిండి ఏర్పట్లను చూసుకోవడానికై ఒక ప్రత్యేక వాయుసేనకు సంబందించిన మిల్ట్రీ హెలీక్యాప్టర్ ప్రతిరోజు రాకపోకలు చేస్తుండగా, ఆ హెలీక్యాప్టర్ పైనా 10-12 మందితో కూడిన బలగాలతో దాడిచేయగా ఆదాడిలో వాయుసేనకు చెందిన 2 జన్ హెలీక్యాప్టర్ పైలేట్లు చావగా, హెలీక్యాప్టర్ కూడా దెబ్బ తినడంతో గత్యంతరం లేక మార్గమద్యలోనే ఆ హెలీక్యాప్టర్ ను ల్యాండిగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈహెలీ క్యాప్టర్ పై దాడి చేసిన బలగాలకు కమాండర్ గా నేనే ఉన్నాను.

6) 2007 లో ఛత్తీష్ గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, చెర్పాల్- బీజాపూర్ మధ్యలో కంపనీ 2 బలగాలతో బీజాపూర్ కు చెందిన రోడ్డు ఒప్నింగ్ పార్టీ పై నిరచవహించిన అంబూష్ లో 6-7 గురు పోలీసులు దావగా 6-7 తుపాకుల్ని (5 ఇన్సాస్ లు, ఒక SLR.ను ఒక 303) స్వాధీనం చేసుకున్నాము అఆంబూష్ లో నేను కూడా ఒకనిగా పాల్గొన్నాను. ఆసమయం నేను కంపనీ 2కు సెక్స్రే ట్రీగా ఉన్నాను.

7) 2007 లోనే ఛత్తీస్ గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా చెర్పాల్, గంగోల్ మద్యలో చెర్పాల్ పోలీస్ క్యాంపుకు చెందిన రోడ్డు ఒప్పింగ్ పార్టీపై కంపనీ 2 బలగాలతో నిర్వహించిన అంబూష్ లో ఇద్దరు CRPF కు చెందిన జవాన్లు చావగా, రెండు తుపాకుల్ని (7.62 LMG-1, ఇన్సాస్- 1) స్వాధీనం చేసుకున్న దాంట్లో నేను కంపనీ 2 సెక్ట్రోట్రీగా ఆ ఆంబూష్ లో పాల్గొని నాయకత్వాన్ని అందించాను.

8) 2008 లో ఛత్తీష్ గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, మోదుగుపాల్ వద్ద రోడ్డు ఒప్నింగ్ పార్టీ పై కంపనీ 2 బలగాలు మరియు సెకండరీ బలగాల్ని కలిపి నిర్వహించిన ఆంబూష్ లో CRPF కి చెందిన 12 మంది జవాన్లు చంపి, 14-15 మందిని గాయపర్చి, ఆయుదాల్ని స్వాధీన చేసుకన్న దాంట్లో నేను కంపనీ సెక్స్రేట్రీగా ఆ ఆంబూష్ లో ప్రత్యక్ష నాయకత్వాన్ని అందించాను.

9) 2008 లో చత్తీష్ గఢ్ రాష్ట్రం, సుకుమ జిల్లా, కుంటా తైసిల్, మినుప గ్రామం వద్ద నిర్వహించిన అంబూష్ లో BN 1 బలగాలు, కంపనీ 2 బలగాలతో పాటుగా, సెకండరీ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఆంబూష్ లో 8 మంది CRPF, DRG కి చెందిన జవాన్లు చావగా, కొన్ని సెమీ, ఆటో ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్న దాంట్లో ఉన్నాను.

10) 2009 లో చత్తీష్ గడ్ రాష్ట్రం, బీజపూర్ జిల్లా, కోర్సెల్- తోడ్క గ్రామ పరిసరాల జంగల్లో కూంబింగ్ కోసం వచ్చిన శతృ బలగాలపైన కంపనీ 2 బలగాలతో పాటుగా సెకండరి బలగాల సంయుక్త అపర్స్ నిటీ అంబూష్ తో చుట్టుముట్టి చేసిన దాడిలో CRPF బలగాలకు చెందిన 3-4 రు జవాన్లు గంభీర్ గాయాలయ్యారు. ఈ ఆంబూష్ లో నేను కంపనీ 2 బలగాలకు సెకరేట్రీగా ఉంటూ పాల్గొన్నాను.
@> నేను విప్లవోద్యమంలో శతృదాడులకు, ఎన్ కౌంటర్లకు గురి అయినటువంటి మొత్తం దాడులు :-

నాపైన జరిగిన మొత్తం దాడులు 25-30 వరకుంటాయి. వీటిలో పెద్ద దాడులు 7 కాగా, ఇందులో సెల్టర్ పై జరిగిన దాడులు రెండు కాగా, ఆటవిలో దళాన్ని పెద్ద సంఖ్యలో శతృబలగాలు చుట్టుముట్టి దాడి చేసినవి 5 ఉన్నాయి. టోటల్ గా వీటన్నింటి యొక్క వివరాలు ఈకింద పేర్కొనబడినవి.

@ ముందుగా 7 పెద్ద దాడులకు వస్తే:-

1) సెల్టర్ పైన 1993 లో నిజామాబాద్ జిల్లా, జాక్రాన్ పల్లి మండలం, పడ్కుల్ గ్రామంలో ఒక సెల్టర్ లో 6 గురితో కూడిన మాదళం ఉన్న పక్క సమాచారాన్ని అందుకున్న వందలాది మంది శతృవుకు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు, దళం వేసివున్న మకాంను చుట్టుముట్టాయి. మాదళంపై జరిగిన 26 గంటల చుట్టివేత దాడిలో 5 గురు కామ్రేడ్స్ అమరులు కాగా నేను ఆ సెల్టర్ ను శతృవు బందించి చేస్తున్న దాడి వలయాన్ని చేదించుకొని బయటపడ్డాను. కానీ ఆసెల్టర్ ను శతృవు బందించి పెట్టిన పస్టు వలయం నుండి నేను బయటపడినప్పటికీ ఆఊరు చివరలో మరోవలయంగా ఉన్న శతృవు వలయాన్ని చేదించుకోలేక ఆగ్రామ ప్రజల రక్షణలోనే మరో 36 గంటలు ఉంటూ ఆప్రజల రక్షనలోనే శత్బవు కళ్ళుకప్పి బయట పడ్డటువంటి పెద్ద దాడీ అది. (ఆదాడి సమయానికి నేను ఆదళానికి నేనే కమాండర్ ను అంటే అప్పుడు నేనూ ACM ను)

2) సెల్టర్ పైన 1999 లో అనుకుంటాను? నిజామాబాద్ జిల్లా, డిచ్ పెల్లీ మండలం, ప్రాజెక్టు రామడుగు అనే గ్రామంలో ఉద్యమవసరాల రీత్య ఒక ముగ్గురితో కూడిన మా టిం(అప్పుడు నేడు Dvcmను, మరో ఇద్దరు పార్టీ సభ్యులు) ఆగ్రామానికి వెళ్ళీ, ఆగ్రామం చివరలో నున్న ఒక పార్టీ సానుభూతి పరునీ ఇంటిలో రాత్రివేలలోనే వెళ్ళి మకాం వేయగా, మకాం వేసి ఉన్న సమాచారాన్ని ఇన్ఫార్మర్ నెట్ వర్కు ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న శతృవు మేమున్న ఇంటినీ చుట్టుముట్టి, ఇంటి దర్వాజల్ని మూసివేసి తాళాలేయగా, అఇంటిలో చిక్కుకపోయిన మాముగ్గురితో కూడిన టీం సమయ స్పూర్ట్స్, చొరవ, దృఢసంకల్స్, త్యాగనిరతిని ప్రదర్శించి ఇంటి పంజరంలో చిక్కి శతృవు చేతిలో చావడాని కంటే అఇంటి పంజరాన్ని చేదించుకొని శతృవుతో తలపడుతు చావడం మేలనీ భావించిన మాటీం ఆఇంటిలోనే దొరికిన గొడ్డళ్లతో శతృవు బందించి పెట్టిన తలుపుల్ని బద్దలు కొడుతూనే మరోవైపు శత్సవు పై కిడికి గుండా కాల్పులు జరుపుతూ శతృవలయాన్ని బద్దలుకొట్టుకొని ముగ్గురీతో కూడిన మాటీం ఏప్రాణాపాయం లేకుండా సమన్వయంతో బయటపడ్డ గటన అది.

3) 1997లో నళ్ల వెళ్ళీ గ్రామానికి చెందిన చదువుకున్న యూత్ తో (వాల్లు ఆఊర్లో భగత్ సింగ్, అంబెట్కర్ ల ప్రేరనతో ఆగ్రామంలో యువజన సంఘాల్ని పెట్టుకొని ఆగ్రామంలో ప్రజాసేన చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నటువంటి వాల్లు) మాట్లాడాలనకున్నాం. మాట్లాడడానికై తగిన జాగ్రతలతో వారినీ పిలుచుకొని మాట్లాడుతున్నప్పటికీ, ఆయూత్ వాల్లతో మాట్టాడుతున్న సమాచారం ఇన్ఫార్మర్ నెట్ వర్కు ద్వారా శతృవుకు చేరడంతో ఆరోజు సాయంత్రానికి శతృవు మేమున్న డేరను చుట్టుముట్టి పైరింగ్ చేయగా దళం అందరు ఒకదిక్కుగా శత్సవ ఫైరింగ్ ను ప్రతిగటస్తూనే బయటపడగా, నేను ఒక్కొన్నే యూతుతో మాట్లాడుతుండగా మాపైనా కూడా శతృవు దాడిని చేపట్టాడు. ఈదాడిలో నేనొక్కోన్నే ఒకవైపుగా శతృవు చేపట్టిన అచుట్టివేత దాడిని ప్రతిగటిస్తూనే శతృవలయాన్ని చేదించుకొని బయటపడ్డాను. కానీ ఆదాడిలో ఇద్దరు యూతు గాయాలయ్యారు. మిగత యూతువాల్లందరీ శతృవు అరెస్ట్ చేసి కేసులు పెట్టాడు.

4) 2000-21 లో కరీంనగర్ జిల్లా, జగిత్యాల మండలం, గజ్జెరాళ్ళ గుట్ట పైనా (అక్కడ ఉధ్యమవసరాల రీత్య జమకూడిన రెండు మూడు దళాలు దాదాపు ఒక 30 మంది వరకు ఉన్నాం.) గ్రేహౌండ్స్ బలగాలకు మేమున్న పక్క సమాచారంతో ఆగుట్టను చుట్టుముట్టి పైరింగ్ మొదలు పెట్టాడు. ఆపైరింగ్ శతృవుకు మనకు మధ్య ఉదయం నుండి సాయంత్రం 4-5 గంటల వరకు జరిగింది. ఆదాడిని చేదించుకొని మన మెజార్టీ బలగాలు బయట పడ్డప్పటికీ అందులో కా.రమేష్ అనే కామారెడ్డి ఏరియాకు చెందిన (ACM) దళ కమాండర్ అమరుడయ్యాడు. (ఈదాడిలో నాతో పాటుగా
మరో ముగ్గురు వరకు Dvcm స్తాయి గల కామ్రేడ్స్ ఉండిరీ.

5) 1998 లో నిజామాబాద్ జిల్లా, సిర్నపల్లి గ్రామం పరిసర జంగల్లో పచ్చిమ దిశలో రైల్వేట్రాక్ అవతలా 13 మందితో ఉన్న మా దళం, మేం ఉన్న సమాచారాన్ని అందుకున్న గ్రేహ్యాడ్స్ బలగాలు మా డేరను చుట్టుముట్టి దాడిచేయగా ఆదాడినీ ప్రతిగటిస్తూ 9 మంది కామ్రేడ్స్ ఒకగృఫ్ గానూ, నలుగురు కామ్రేడ్స్ ఒక గౄపు గానూ పస్టు దాడినుండి బయట పడినప్పటికి, విడివడిపోయి బయట పడినా నలుగురితో కూడిన గౄపుపైనా శతృవు మరోసారీ అడ్డం తిరిగి దాడిచేయగా ఆదాడిని ప్రతిగటిస్తూనే ఆఉన్న 4 గురు టీంలోనే ఇద్దరు ఒకవైపుగానూ మరో ఇద్దరు మరోవైపుగానూ రెండు టీంలుగా విడిపోయాయి. (ఈనలుగరి టీంలో కా,, న్యాలకొండా రజిత పదుక్కు- Szcm తో పాటుగా మరో పార్టీ సభ్యురాలు ఒక టీంగానూ, నాతో పాటుగా మరొక దళ సభ్యురాలు ఒక టీంగాను విడిపోయాము. ఆరోజు మాపైనా జరిగిన దాడీ ఉదయం 10-11 గంటలకు స్టాట్ అయిన నుండి రాత్రి 9-10 గంటల వరకు శతృదాడులకు పలుమార్లు గురవుతూ వానీ గేరావ్ లోనే ఉండి అతర్వాత వాని గెరావ్ నుండి బయటకు వచ్చిన దాడదీ. అప్పుడు నేను Dvcm ను)

6) 13-5 2021 లో మహారాష్ట్ర రాష్ట్రం, జిల్లా గడ్చిరోలి, తైసిల్ ధనోర, మర్సుల్ గ్రామ పరిసర జంగల్లో 35 మందితో కూడిన మన బలగాలు ఆరోజు రాత్రికి మకాం వేసుకొని ఉన్నాయి. మనం ఉన్న సమాచారాన్ని మనం ఆరోజు ఆధారపడిన స్థానిక నిర్మాణంలో ఉన్న కోవార్డు ద్వారా పక్క సామాచారాన్ని తెలుకున్న ఆరాష్ట్ర స్పేషల్ సి 60 బలగాలు రాత్రికి రాత్రే ఎంగేజ్ అయ్యి మేము మకాం వేసివున్న మెట్టను 500 వందల మీటర్ల దూరం నుండి చుట్టివేసి ఉదయం తెల్లవారుజమునా దాడిచేశాడు. మన PLGA బలగాలు ప్రతిగటిస్తూనే ఎటురిట్రీట్ అవుతే అటుగా చుటుముట్టి యున్న శతృవు రాపిడ్ పైరింగ్ చేయసాగగా, మేము పైరింగ్ మధ్యలోనే కమాండ్ సమావేశమై శతృవలయాన్ని చేదించడానికై బ్రేకింగ్ పోర్స్ ను ఏర్పర్చగా, ఏర్పర్చిన ఆబ్రేకింగ్ పోర్స్ కూడా శతృవలయాన్ని చేదించడానికై వెనకముందాడడంతో అప్పుడు టోటల్ కమాండ్ అంత కలిసి బ్రేకింగ్ పోర్స్ గా ఏర్పడి దృఢసంకల్పంతో శతృవు చుట్టుముట్టియున్న వలయంపై సెల్లింగ్, పైరింగ్ ల ద్వారా విరుచుక పడడంతో ప్రాణభీతికి లోనైనా శతృవు బలగాలు ఒక సక్షణ్ మంది తమ 7 కిట్లను పారవేసి పరుగులు లంకించుకోగా మన PLGA బలగాలు శతృవు వదిలివెల్లిన కిట్లనన్నింటినీ స్వాదీనం చేసుకొని వచ్చాయి. ఈదాడిలో మన కామ్రేడ్స్ రాజల్(ACM), కారణిత(PM) లు ఇద్దరు అమరత్వం, చెందారు. (అప్పుడు నేను Szcm ను .)

7) ఏప్రిల్ 29,2024 చత్తీష్ గఢ్ రాష్ట్రం, కాంకేర్ జిల్లా, పఖాంజూర్ తైసిల్ కాకూర్ టేకమెట్టా గ్రామాల పరిసర జంగల్లో మన బలగాల సమాచారాన్ని వివిధ మార్గాల ద్వారా తెలుకున్న శత్సవు ఏప్రిల్ 29 రాత్రికే ఎంగేజయినా 1500 వందలకు పైబడిన శతృబలగాలు ఎటూ 25-30 కిలోమీటర్ల పరిదినీ కవర్ చేస్తూ ఏప్రిల్ 30 ఉదయం దాడిమొదలు పెట్టిన శతృవు సాయంత్రం 4గంటల వరకు మన బలగాలు ఎటువెళ్తే అటు విచ్చలవిడిగా దాడులు చేయగా, శతృవు చేపట్టిన దాడులన్నింటిని ప్రతిగటిస్తూ శతృవలయాన్ని చేదించుకొని వచ్చిన దాంట్లో నేను ఒకడిని.( అప్పుడు నేను Szcm ను). శతృవు చేపట్టిన ఈపెద్ద చుట్టివేత దాడిలో మన కామ్రేడ్స్ 6గురు, గ్రామస్తులు 4 గురు అమరత్వం చెందగా, మిగత మందిమీ ఆశత్సవలయాన్ని చేదించుకొని వచ్చాము.

నాపైన జరిగిన పైన పేర్కోన్న 7 పెద్ద దాడులతో పాటుగా ఇంక ఎన్నో నాపైన జరిగిన ఎన్ కౌంటర్స్, దాడులకు సంబందించిన వివరాలు ఈకింద పేర్కొనడమైంది.<<

8) 1999 చివరలో ఆంధ్ర (ఇప్పుడు తెలంగాణ) రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, సిరిసిల్లా ఏరియా మరిమడ్ల గ్రామసమీపంలో అటవి అచ్చునా ప్రజలు తునికాకు కోసుకుంటున్న కాలం అదీ. శతృవు సివిల్లో వుండడంతో మనం శతృవునీ ప్రజలుగా భావించి మనం శతృవుకు దగ్గరగా పోతున్న సమయంలో శతృవు కవర్లలోకి పోతున్నదాన్ని
గమనించిన మాదళం(11 మదిమీ) మాదళమే పస్టు పైర్ చేయగా శతృవు కూడా పైర్ మొదలు పెట్టాడు కానీ ఈదాడిలో ఎవరికీ ఏమి కాలేదు. సేప్ గా రీట్రీట్ అయ్యాము (నేను ఆ సమయంలో Dvcm ను)

9) 1999 లో ఆంధ్ర (ఇప్పుడుతెలంగాణ) రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి ఏరియా, మద్దికుంట గ్రామం జంగల్లో 10 మందితో కూడిన మా దళం సమాచారాన్ని తెలుసుకున్న గ్రేహౌండ్స్ బలగాలు మాదళం ఉన్న మకాం పైకి శతృవు వస్తుండనె సెంట్రీ ఇచ్చిన కాషన్ తో వెంటనే సమాన్లను సర్దుకొని మనమే శతృవుపై ముందు ఫైర్ చేయగా శతృవు అడ్వాన్స్ కు బ్రేక్ పడి వున్నవద్దనే పోజిషన్స్ తీసుకొని విచ్చలవిడిగా పైర్ చేశాడు. కానీ ఈదాడిలో మనకేమీ నష్టాలు లేకుండా రిట్రీట్ అయ్యాము (ఈసమయంలో నేను Dvcm ను.).

10) 2000 సం,,రం లో ఆంధ్ర రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, దర్పల్లి మండలం, లింగపురం-దొన్కల్ గ్రామాల మద్య 11 మందితో కూడిన మాదళం కు(అప్పుడు నేను Dvcm ను) గ్రేహుడ్స్ బలగాలతో పైరింగ్ జరిగింది. ఆపైరింగ్ లో ఎవరికి ఏమి కాలేదు. వివరాలకు వస్తే నిర్నపల్లి ఏరియాలో ఆర్గనేషన్ లో భాగంగా తిరుగుతు మేము క్యాసారం,ఎల్లరెడ్డిపల్లి అనే గ్రామాల వైపు నుండి దర్పల్లి రోడ్డును దాటుకొని దొన్కల్ వైపు వస్తున్నారనే సమాచారం అందుకున్న శతృవు లింగపురం పరిసర జంగల్లోని ఒక లంబాడి తండ వద్ద శతృవు ఒక చిన్నపాటి మెట్టపైన (మాదళం ఆరూట్లోనే రావచ్చనే అంచనతో) మాదళం కోసం మాటువేసుకొని ఉంట్టూ, ఱ లంబాడ తండాకు చెందిన ఒక మహిళా మద్యవయస్కురాలు(ఆమె శతృవు నెట్ వర్కులో ఉందనె విశయం మాకు తర్వాత అర్థమైంది.) ను శతృవు పిలుచుకొని మాట్లాతుండగా మా దళం ఆమెట్ట కిందినుండి ప్రజలు వస్తూపోయేటి వంటి ఆచిన్నపాటి త్రోవగుండా వెల్తుండగా, ఆ మెట్టపైన ఆమహిళా అగుపడింది. కానీ ఆ మహిళా ఉన్న ప్రక్కనె శతృవు పొరుకలసాటునా కూర్చోని ఉన్నందున మాకు వాడు కనపడలేదు. ఆమహిళను చూసిన మేము ఆమే అడవికి ఎదో పనిమీద వచ్చివుంటుందనే దాంతో ఆమహిళను పులుచుకొనీ అక్కడి పరిస్తితినీ తెలుసుకుందామనే దాందో ఆమహిళను రమ్మనీ పిలువగా ఆమహిళను శతృవే మావద్దకు వెల్లమని పంపించి, వాడు మాదళాన్ని గెరావ్ చేసే ప్లాన్ లో భాగంగా వాడు మెల్లగా దూరంనుండి మాదళం వైపు తిరుగుతున్న దాన్ని మేముపసికట్టడంతో మేమే వానిపైనా పస్టుగానే పైరింగ్ స్టాట్ చేయడంతో శతృవు అడ్వాన్స్ కు బ్రేకులు పడ్డాయి. దాంతో శతృవు ఉన్నవద్దనే పోజిషన్ లోకి వెళ్ళీ వైర్ చేశాడు. ఆదాడిలో ఎవరికేమీ నష్టం లేకుండా నూదళం రీట్రీట్ అయింది. (అప్పుడు నేను Dvem ను)

11) నిజామాద్ జిల్లా, సిర్నపల్లీ అనే గ్రామంలోనే దళానికి సంబందించిన కొన్ని పనుల రీత్య ఒక నలుగురితో కూడిన టీం ఆగ్రామానికి వెళ్ళింది. ఆగ్రామానికి సంబందించినటువంటి మేయిన్ రోడ్డు సిర్నపల్లి రైల్వేస్టేషన్ నుండీ ఆఊర్లోకి వచ్చే రోడ్డు ప్రక్కనే ఉన్న ఒక ఇంటి కుటింబీకులతో మాట్లాడుతుండగా రాత్రి 12 గంటల సమయంలో గ్రేహౌండ్స్ బలగాలు సివిల్లో ఆమెయిన్ రోడ్డుగుండా వస్తున్న విషయాన్ని మన సెంట్రీ చూస్తుండింది కానీ శతృవు సివిల్లో వున్నందున ఎవరో ప్రజలుగా భావించింది. (ఆరాత్రి ఆఊర్లో ఒక ఇంటిలో ఎదో ఒక పంక్షన్ ఉన్నందున ఆఊరి ప్రజలు 12, 1 గంట వరకు బజన చేసుకుంటున్నారు కాబట్టి మన సెంట్రి ఆప్రజలే బజనచేస్తున్న స్థలం నుండి వస్తున్నారు కావచ్చనేది అనుకుంది) కానీ శతృవు దగ్గరలోకి వస్తున్న టైంలో వెపన్స్ అగుపడడంతో శతృవనేది అర్థమై వెంటనే నాకు కబుర్ ఇవ్వడంతో వెంటనే ఆఇంటినుండి బయటకు వచ్చి మరొక ఇంటిగోడల్ని కవర్ తీసుకొని శతృవు పైన పైర్ చేసింది. శతృవు కూడా కొన్ని రౌండ్స్ కాల్పులు జరిపాడు. కానీ ఎవరికి ఏమి కాకుండా మాటీం సేఫ్ గా రిట్రీట్ అయ్యి వచ్చింది. ఈటింకు బాధ్యునిగా నేనే ఉన్నాను. (ఆసమయంలో నేను Dvcm ను.)

12) 2016 లో గడ్చిరోలీ జిల్లా, ఏటపల్లి తైసిల్, కసన్ సూర్ ఏరియా, గడ్డపల్లి గ్రాను పరిసరత్ జంగల్లో మేము ఒక 30-35 మంది వరకు ఉన్న నపై పక్క సమాచారంతో రెండు బ్యాచీలుగా వచ్చిన శతృబలగాలు మేము ముందుగా ఒక బ్యాచికి తారసపడడంతో రెండు వైపుల వైరింగ్ జరిగింది. కానీ ఈదాడిలో ఏవరికేమి కాకుండా సేప్ గా రిట్రీట్ అయ్యాము. వివరాలకు వస్తే:- కొన్ని కంపనీ 4 బలగాలతో పాటుగా సెకండరీ బలగాలు కలిసి మకాం వేసివున్న పక్క సమాచారాన్ని తెలుసుకున్న శతృవు, రెండు బ్యాచీలుగా ఎంగేజ్ అయ్యి ఒక బ్యాచీ మనల్నీ డైవర్ట్ చేయాడానికై అందరికీ అర్థమయ్యేలా డైరెక్టు గ్రామానికే వచ్చి గ్రామచివరలో రోడ్డుపైనే కూర్చోనీ ఉన్నాడు. ఎందుకంటే మనం ఈ బ్యాచ్ రీపోర్టు తెలియాగానే మనం అప్పటివరకు వేసి ఉన్న డేరను మార్చుకొని ఇంకొంత సేప్ గా. మరోబ్యాచి రండిగా సెట్ చేసి పెట్టాడు. కాబట్టి) ఆమెట్టల్లో ఉన్న శతృబలగాలు దాడి చేస్తే మనం మెట్టలనుండి. మైదానం దిశలోకి రీట్రీట్ అవుతే మైదానంలో మనల్ని ఇరికించి దెబ్బతీయాలనుకున్నాడు. శతృవు వూహించినట్లుగానే మాబ్యాచీ అప్పటివరకున్న డేరను మార్చుకొని లోపలగా ఉన్న మెట్టపైకి ఎక్కి రోల్ కాల్ చేస్తున్న సమయంలోనే అప్పటికే ఆమెట్టపైన అంబూష్ లో కూర్చోని రడిగా ఉన్న శతృవును మేం రోల్ కాల్ చేసే సమయంలో మన సెంట్రీ రోల్ కాల్ చేస్తున్న దానికి ముందువైపుగా వెళ్ళిన సెంట్రీ శతృవును గమనించిన వెంటనే శతృవనే కాషన్ ఇవ్వడంతోనే శతృవు పైరింగ్ స్టాట్ చేయగా మనబలగాలు కూడా శతృవునీ ప్రతిగటిస్తు మైదానం బగిలి రీట్రీట్ కాకుండా మరోదిశలో రిట్రీట్ అయ్యాము. దీంతో ఎలాంటి నష్టాలు లేకుండా రిట్రీట్ అయ్యాము.

13) 2017లో గడ్చిరోలీ జిల్లా, ఏటపల్లి తైసిల్, శాముర్శి ఏరియా, ఇరుపగుట్టా గ్రామ పరిసరత్ జంగల్లో 15 మంది వరకు మేమున్న డేరపైకి దాడికోసం వస్తున్న C-60 బలగాల ను ముందే మాసెంట్రీ గమనించి శతృవుపై పైర్ చేయగా, శతృవు కూడా ఫైర్ చేశాడు కాని అడ్వాన్స్ కాలేకపోయాడు. మనం ప్రతిగటిస్తూ రిట్రీట్ అయ్యాము.

14) 2018 లో కసన్ సూర్ ఏరియా గోటేన్ ఖార్కా గ్రామ పరిసరత్ జంగల్లో జరిగిన పైరింగ్ లో మేమున్న దళం శతృవును గట్టిగ ప్రతిగటిస్తూ రిట్టిట్ అయ్యాము. కానీ ఈదాడి సందర్భంగా ఒక ఇద్దరు కామ్రేడ్స్ విడివడిపోయీ మేము పెట్టుకున్న జండ్రల్ కాంటాక్టు వద్దకు అదేరోజు రాత్రికి మాకాంటాక్కులోకి వచ్చారు.

15) 2019 జూన్ లో గడ్చిరోలీ జిల్లా, ఏటపల్లి తైసిల్, కసన్ సూర్ ఏరియా కుండుం గ్రామ సమీప జంగల్లో ప్రొద్దున్నే 35-36 మందితో కూడుకున్న మా బ్యాచి వెళ్ళి అప్పుడే డేరలో కవర్లు తీసుకొనీ, వంటకోసమని కొందరు కట్టెలు, నీళ్లు తీసుకొచ్చారు అంతే అప్పటికే ఆజంగల్లోనే ఉండివున్న C. 60 బలగాలు మాడేరను చుట్టుముట్టడానికీ తిరుగుతున్న విషయాన్ని గమనించిన మన సెంట్రీ కామ్రేడ్ వెంటనే ఫైర్ చేయడంతో రెండు వైపులా దాడి జరిగింది. తర్వాత మేము ప్రతిగటిస్తూనే రిట్రీట్ అయ్యాము.

16) 2019 జూలై 29 న జిల్లా గడ్చిరోలీ, ఏటపబ్లీ తైసెల్, శాముర్శి ఏరియా కాడ్స్కి గ్రామం పరిసర జంగల్ లో మేము ఒక 30 మందివరకు ఉన్న సమాచారాన్ని తెలుసుకున్న C-60 కమాండో బలగాలు ఉదయం మాడేరాను రెండు వైపులా చుట్టుముట్టి దాడిచేయగా అందులో ఒక మహిళా కామ్రేడ్ పార్టీ సభ్యురాలు సుశీల అమరత్వం చెందగా మిగత కామ్రేడ్స్ అందరం శత్సవును ప్రతిగటిస్తూ రిట్రీట్ అయ్యాము.

17) 2018 లో టిప్పగఢ్ ఏరియా, ధనోర తైసిల్, డబ్బధరచి గ్రామం పరిసర జంగల్లో 10-11 మందితో కూడిన మా దళం సమాచారాన్ని తెలుసుకున్న C.60 బలగాలు మేమున్న అవుటర్ సర్కిల్లో అంతటా బలగాల్ని సెట్ చేసి మాడేరను చుట్టుముట్టె ప్లానులో ఎంగెజ్ అవుతున్నాడు. (ఈవిషయం మాకు ముందు అర్థం కాలేదు.) కానీ మేము మా మాకం నుండి జండ్రల్ గానే పోదామనే దాంతో సర్దుకొని మేము బయలుదేరిన అరగంట దూరంలో మేము పోయే రూట్ లోనే శతృవు ఎల్ ఆకారంలో ఆంబూష్ కూర్చున్నాడు. మేము వానీ కిల్లింగ్ జోన్లోకి వేల్తున్న సమయంలో ఎల్ పార్మేషన్లో ఉన్న శతృవు మాదళాన్ని పూర్ణిగా గేరావ్ చేయాలనే దాంతో వాడు మా వెనకవైపుగా తిరుగుతున్న విషయాన్ని గమనించిన మాదళం వెంటనే పోలీస్ అనే కాషన్స్ ను ఇస్తు మేమే శతృవుపై ముందుగా కాల్పులు జరపడంతో శతృవు వున్న పోజిషన్స్ నుండె కాల్పులు జరిపాడు. అడ్వాన్స్ కాలేకపోయాడు. అక్కడి నుండి మేము రిట్రీట్ అయ్యి మరో దిశలో ఒక అరగంట వెల్లగా అక్కడ ఉన్న ఒక మెట్టపైన మరొక శతృవు బ్యాచి మకాం వేసుకొని ఉన్న బ్యాచిని మేమే గమనించి అక్కడినుండి వేరే రూట్లో రిట్రీట్ అయ్యి వచ్చాము.

18) 2019 మే లో గడ్చరోలీ జిల్లా, ధనోర తైసిల్, టిప్పగఢ్ ఏరియా, ధరచీ గ్రామ పరిసరత్ జంగల్లో TCDC కై ఎంగేజయినా 50 మంది వరకు ఉన్న మాడేర వైపుగా జండ్రల్ గానే వచ్చిన C-60 బలగాలు మాడేరకు 200 మందల దూరంలో ఉన్న నీల్లకోసం వెళ్ళిన మన బలగాల పైనా శతృవు దాడి చేయగా అందులో ముఖేష్ అనే పార్టీ సభ్యుడు. అమరుడు కాగా మిగత కామ్రేడ్స్ అందరం శతృవును ప్రతిగటిస్తూ రీట్రీట్ అయ్యాము.

19), 2019 లో గడ్చిరోలీ జిల్లా, ఏటపల్లి తైసిల్, చాత్ గావ్ ఏరియా, బడా అన్ ఫైల్ గ్రామ పరిసర జంగల్లో 20-
25 మందితో కూడిన మా బలగాలు ప్రయానంలో ఉండగా C-60 బలగాలు తారసపడగా రెండువైపులా పైరింగ్ జరిగింది.కానీ ఎవరికేమి కాకుండా రిట్రీట్ అయ్యాము.

20) 2019 లో ఎట్టడ్ కన్సా వద్ద శృతృవు డేరవేసుకొని వున్నడనే సమాచారంతో వాడు ఏలాగో గాంగినీ అనే గ్రామం వైపుగా వెళ్తాడు అనే అంచనతో మేము ఎట్టడ్ కస్సా- గాంగినీ మద్యలో అంబూష్ కు ఎంగేజయ్ దాడి చేద్దామనే దాంతో మేము ఒక 10 మంది వరకు దాడికి వెల్తున్న సమయంలో శతృవు ఎట్టడ్ కస్సావైపునుండి రెండొవ బ్యాచి భయలు దేరీ మాకు సర్ ప్రైజ్ గా ఎట్టడ్ కస్సా- గాంగినీ గ్రామాల మద్యలో శతృవు తారసపడడంతో రెండువైపులా పైరింగ్ జరిగింది. కానీ ఎవరికి ఏమి కాకుండా మాబ్యాచ్ రిట్రీట్ అయ్యి వచ్చింది.

పార్టీజరుపుకున్న వివిద స్థాయిల్లోనే మహాసభలు, ఫ్రీనాలలో నేను పాల్గొన్న వాటి వివరాలు

@ రెండు రాష్ట్ర స్థాయి పార్టీ మహాసభలు జరిగిన వాటిల్లో:-

1) వది, 2001 లో తెలంగాణాలో జరుపుకున్న రాష్ట్ర స్థాయి మహాసభకు హాజరుకాగా.

2) వది, 2006 లో డీకేలో జరుపుకున్న డీ. రాష్ట్ర మహాసభకు హాజరయ్యాను.

O రాష్ట్ర స్థాయి పార్టీ ప్లీనాలు ఐదింటిలో పాల్గొన్న వివరాలకు వస్తే

  • 1 వది 1998 లో ఉత్తర తెలంగాణాలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్లీనంలోనూ.
  • 2 వది, 2003 లో తెలంగాణాలో జరుపుకున్న రాష్ట్ర ప్లీనానికి,
  • 3 వది, 2011 లో జరుపుకున్న డి.కె ప్లీనానికి.

4 వది. 2015 లో జరుపుకున్న డీ.కె ప్లీనానికి.

  • 5 వది, 2020 లో జరుపుకున్న డీ.కె ప్లీనానికి హాజరయ్యాను.
  • డివిజన్ స్థాయి మహాసభలు రెండింటిలో పాల్గొన్న వివరాలకు వస్తే:-
  • 1 వది నిజామాబాద్ జిల్లాలో 1994లో జరిగిన డివిజన్ మహాసభలో పాల్గొనగా,
  • 2 వది డికెలో 2005 లో దక్షిణ్ బస్తర్ డివిజన్ లో జరిగిన డివిజన్ మహాసభకు హాజరు అయ్యాను.
    డివిజన్ స్థాయి ప్లేనాలు 5 టిలో పాల్గొన్న వివరాలకు వస్తే :-

1వ డివిజన్ స్థాయి ప్లీనం 1998 లో నిజామాబాద్ జిల్లాలో జరుపుకున్న ప్లీనం కాగా.

2 వ ప్లీనం డీకె లో 2012 లో ఉత్తర్ గడ్చిరోలీ డివిజన్ లో జరుపుకున్న డివిజన్ స్థాయి ప్లీనం.

3 వ ప్లీనం 2015 లో జరుపుకున్న ఉత్తర్ గడ్చిరోలీ డివిజన్ ప్లీనం.

4 వ ప్లీనం 2021 లో జరుపుకున్న ఉత్తర్ గడ్చిరోలి డివిజన్ ప్లేనం.

5 వ ప్లీనం 2021 లోనే దక్షిణ్ గడ్చిరోలీలో జరుపుకున్న డివిజన్ స్థాయి ఫ్లీనంలో పాల్గొన్నాను.

PLGA కంపనీ పార్టీ కమిటీ ప్లీనాలు 3 టిలో పాల్గొన్న వివరాలకు వస్తే :-

11 వ ప్లీసం డీకె లో కంపనీ-2 కు 2012 లో జరిగిన ప్లీనానికి,

1 2 వ ప్లీసం డికె లో కంపనీ-4 కు 2012 లో జరిగిన ప్లీనానికి,

1 3 వ ప్లీసం కంపనీ- 4కు 2021 లో జరిగిన ఫ్రీనానికి.

ఎరియా స్థాయి ఆరూ ప్లీనాలలో పాల్గొన్న వివరాలకు వస్తే :—

నిజామాబాద్ జిల్లాలోని 1)సిర్నపల్లి, 2) కామారెడ్డి, 3) సిరిసిల్లా ఏరియా స్థాయిలో జరిగిన 3 ప్లీనాలలో పాల్గోగా, డికె లో ఉత్తర్ గడ్చిరోలీ డివిజన్ లో 4) టిప్పగఢ్ ఏరియా, 5) చాత్ గావ్ ఏరియా, కసన్ సూర్ ఏరియాలలో 2008-9 లలో జరిగిన ఈ మూడు ఏరియా ప్లీనాలలో పాల్గొన్నాను.

నేను విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాత పార్టీ గ్రేడెషన్ వారిగా నిర్వహించిన ముఖ్యమైన పాల్టికల్ క్లాసుల్లో నేను పాల్గొన్న క్లాసులు

  • 1993 లో నిజామాబాద్ జిల్లాలో Dvc, Ac వాల్లకు జరిగిన రాజకీయ క్లాసులు ఎకనామిక్స్, ఫిలాసఫీ, ఎమ్.ఎల్.ఎమ్ క్లాసుల్లోనూ (నేనప్పుడు Acmగా పాల్గొన్నాను)

1996 లో ఒక సారీ నిజామాబాద్ జిల్లాలో స్టేట్ కమిటీ కామ్రేడ్స్ DVC వాల్లకు చెప్పిన ఎకనామిక్స్, ఫిలాసఫీ,

ఎమ్.ఎల్.ఎమ్ పైనా చెప్పిన క్లాసుల్లోనూ. (అప్పుడు నేను Dvcm గా) పాల్గొన్నాను.

2010 డి.కె లో Szc-mS కు రీపోస్ వాల్లు, మరియు CC కామ్రేడ్ చెప్పిన ఎకనామిక్స్, ఫిలాసఫీ, ఎమ్.ఎల్.ఎమ్ క్లాసుల్లో అప్పుడు నేను Szcm గా పాల్గొన్నాను.

నేను సంఘంలో ఉండగానూ, విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాత నేను విద్యార్థిగా మిలొ ట్రైనింగ్ కై పాల్గొన్న టోటల్ మిల్ట్రీక్యాంపులు కిందపేర్కొనటువంటివి.

1989లో నేను విప్లవోద్యమంలోకి రాకముందు సంఘంలో పనిచేస్తున్న సమయంలో ఏరియా లేవెల్లో జరిపిన మిల్ట్రీక్యాంపులో ఒకసారి పాల్గొన్నాను.

1992లో జిల్లాలో దళాలకు జరిగిన మిల్ట్రీ క్యాంపులో ఒక సారి పాల్గొన్నాను.

1996 లో తెలంగాణ స్టేట్ లేవెల్లో (ఆదిలాబాద్ లో) జరిగిన మిల్ట్రీ క్యాంపులో పాల్గొన్నాను. (Dvcm గా)

1999 లో సెంట్రల్ లేవెల్లో (DK లో) జరగిన మిల్ట్రీ క్యాంపు (నిజామాబాద్ జిల్లా నుండి ఇద్దరంవచ్చాము) ట్రేనింగ్ లో పాల్గొన్నాను.

  • 1998-99 లో అనుకుంటాను తెలంగాణ స్టేట్ లెవెల్లో (ఆదిలాబాద్ జిల్లాలో) జరిగిన మిస్ట్రీ క్యాంపు ట్రేనింగ్ లో పాల్గొన్నాను.( అయితే ఆక్యాంపుకు వచ్చే తిండి సరుకులు ఎక్స్ పోజ్ అయ్యి శత్బవు దాడి జరగడంతో కొంత డిస్ట్రాప్ అయింది

2004 లో D.K లో (కంపనీ 1 నిర్మాణం సందర్భంగా) జరిగిన మిల్ట్రీ క్యాంపు ట్రేనింగ్ లో పాల్గొన్నాను.

2009 లో D.K లో (పూర్వబస్తర్ లో) జరిగిన సెంట్రల్ మిస్ట్రీ క్యాంపు ట్రేనింగ్ లో పాల్గొన్నాను

2012 లో డి.కె లేవెల్లోని డివిజన్ కమాండర్ ఇన్ చీప్ లకు, కంపనీ కమాండర్లకు, సబ్ జోన్ కమాండర్ ఇన్ ఛీప్ లకు కలిపి నిర్వహించిన మిల్ట్రీ ట్రేనింగ్ లో పాల్గొన్నాను.

©నేను మిస్ట్రీ ఇన్ స్ట్రక్టర్ మిగత ఒకరిద్దరితో కలసి కిది బలగాలకు ట్రెసింగ్ ఇచ్చిన మిల్టిక్యాంపులుⒸ

1996 లో నిజామాబాద్ జిల్లాలో డివిజన్ లేవెల్లో జరిగిన మిల్ట్రా క్యాంపు లో నేను ఇన్ స్ట్రక్టర్గా పాల్గొని ట్రేనింగ్ ఇంచినదాంట్లో నేనొక్కొన్ని,

2005-6 సం„రం లో అనుకుంటాను దక్షిణ్ బస్తర్ లో కంపెనీ బలగాలకు (కంపనీ 2 నుండి కంపనీ 3 నీ నిర్మాణం చేసే సమయంలో) నిర్వహించిన మిల్ట్రీ క్యాంపులో మిగత కామ్రేడ్స్ తో పాటు నేను కూడా మిల్ట్రీ ఇన్ స్ట్రక్టర్ గా పాల్గొని 100 కు పైబడిన బలగాలకు ట్రేనింగ్ ఇచ్చిన దాంట్లో నేనొక్కడినీ,

2014 లో డి.కె లో కంపనీ 10 కు నిర్వహించిన మిల్ట్రీ క్యాంపులో నేనే మేన్ గా ఇన్ స్ట్రక్టర్ గా పాల్గొని 12 రోజులు 40-45 మందికి ట్రేనింగ్ ఇచ్చాము.
2015 లో పశ్చిమ్ సబ్ జోన్ లేవెల్లోని సెంకండరీ బలగాల కమాండర్స్ కు, మరియు రెండు కంపనీలకు చెందిన కమాండర్స్, డిప్యూటీ కమాండర్స్ కు కలిపి నిర్వహించిన మిల్టిక్యాంపుకు కూడా నేనే ప్రధాన ఇన్ స్ట్రక్టర్గా ఉండీ 40 -45 మందకి ట్రేనింగ్ ఇచ్చాము.

2018 లో ఉత్తర్ గడ్చిరోలి లోని సెకండరీ బలగాలకు, మరియు కంపనీ 4 కు చెందిన బలగాలకు కలిపి నిర్వహించిన మిల్ట్రీ క్యాంపులో మిగత కామ్రేడ్స్ తో పాటుగా నేను కూడా మిల్ట్రీ ఇన్ స్ట్రక్టర్ గా పాల్గొని ట్రేనింగ్ ఇచ్చిము. ఈ క్యాంపులో సెకండరీ బలగాల, కంపనీ 4 బలగాలకు చెందిన కమాండర్స్, డిప్యూటీ కమాండర్స్, కొంతమంది సెలెక్టెడ్ పార్టీ, పి.ఎల్.జి.ఎ సభ్యులు అందరు కలిపి దాదాపు 40 మంది కామ్రేడ్స్ పాల్గొన్నారు.

Ⓒమా గ్రామం రీపోర్టు శార్జ్ గా కొంత :-

5)కాపువాల్లు 10 కుటుంబాలు, 6) ముస్లింలు 20 కుటుంబాలు, 7)పద్మశాలీలు 5 కుటుంబాలు, 8) అవుసుల వాల్లు 4-

మా ఊర్లో 1991 నిటికి ఒక 12 కులాలకు చెందినా (దళితులు అంటే 1) మాదిగ వాల్లు 70 కుటుంబాలు, 2)మాలవాల్లు 25 కుటుంబాల వరకు, 3) కురుమోల్లు 70-80 కుటుంబాలు, 4) ఆరెవాల్లు 25-30 కుటుంబాలు. 5 కుంబాలు, 9) కమ్మరి వాల్లు 2 కుటుంబాలు, 10) ఎరుకల వాళ్లు 2 కుటుంబాలు,) నిజామాబాద్ జిల్లా ఉద్యమం స్టాట్ అయినప్పటి నుండి విప్లవ కార్యక్రమాలు కొనసాగుతు వస్తున్న గ్రామం. బలమైన ప్రజాసంఘం ఉంటూ భూస్వాముల ఆగడాలను వర్గపోరాటం ద్వారా అడ్డుకుంటూ వస్తున్న గ్రామం. మన పార్టీ చేతులో ఒక ప్రజా కంఠకుడు అయినటు వంటి అంజయ్య అనే అనే సర్పంచ్ ని (కోమటీ కులం వాడు) 19885-86 లో అనుకుంటాను దళం చేతుల్లో ఆయుధాలతో కాల్చి, గొడ్డళ్లతో తళ పూర్తిగానే నరకివేయబడ్డాడు. ఒక సమయంలో మాఊరి భూస్వామికి చెందినటువంటి చిన్న రాజిరెడ్డి తమ్ముడు నారయన్ రెడ్డి అనేవాడు ఎక్కడో ప్రజలముందు వాగుతూ పార్టీ తుపాకులతో ఆటలాడుతుందిరా? తుపాకులు లేకపోతే ఒక్కొక్కోన్ని విరిచి కుప్పపెట్టె వాన్ని మాట్లాడిన రీపోర్టు పార్టీకి చేరిందీ. దాంతో ఒక సందర్భంగా దళం మాఊర్లోకి వచ్చి ప్రజా మీటింగ్ పెట్టి ప్రజలముందు తుపాకులను పక్కన పెట్టెస్తే మాతో కబడ్డి ఆడి మాసంగతేంటో చూస్తానన్న నారయణ రెండి కోసమే మేము తుపాకులు పక్కన పెట్టేసే కబడ్డి ఆడడానికే వచ్చాము. కాబట్టి అతన్ని తీసుక రమ్మని చెప్పగా వాన్ని ఆకుంబసభ్యులు ఆరోజు ఎక్కడొ దాచి పెట్టి ఊరికి పోయాడనీ నాటకమాడుతూ ఆకుటుంబమంత పార్టీ కాళ్ళవేళ్ల పడుతూ అతనికి బదులుగా కుటుంభం”. క్షమాపన చెప్పగా పార్టీ వారికి క్షమాపన చెప్పాల్సింది మీరు కాదు ఆనారయన్ రెడ్డినే రేపటి రోజు ఉదయమే గ్రామ పంచాయత్ వద్దకు వచ్చి ప్రజలందరి ముందు 10 గజాల దూరం వరకు ముక్కు నేలకు రాసి పోవాలనీ లేనిచో చంపిస్తామనీ హెచ్చరించి పోగా వాడు దళం హెచ్చరించి పోయినా విందంగా 10 గజాల దూరం ముక్కును రాసిపోయాడు. మాఊర్లో మరో కొంతమంది ప్రజా వ్యతిరేకులు పార్టీ చేతులో దెబ్బలు తిన్నవాల్లు ఉన్నారు. అలాగే మా ఊర్లో 4 గురు సంఘకార్యకర్తలు అమరులయ్యారు. వారిలో(నర్సింలు ఇయన ముందు పార్టీలోకి వచ్చి నల్గొండా జిల్లాలో కమాండర్ గా పనిచేసి తిరిగి వెనక్కి వచ్చి సరెండరయి మళ్లీ యాక్టివ్ సంఘంలో పనిచేస్తుండగా శతృవు ఇతన్ని చాలా రోజులు వెంటాడి చంపింది. మరొక ముగ్గురు( స్వామి, అనిల్, నర్సింలు అనే వీరు ముగ్గురు కూడా దళితులే) నీ శతృవు మా ఊర్ నీ చుట్టుముట్టి పట్టుకొని కాల్చి చంపాడు. మరోక దళ సభ్యురాలు మానస అనే కామ్రేడ్ ( ఈమానస అమరడయిన సంఘనాయకుడు నర్సింలు మాజి దళ కమాండర్ బిడ్డా.) కూడా పార్టీలోకి వచ్చిన తర్వాత న్యాలకొండా రజిత (పద్మ) Szcm కు గార్డుగా నేరెళ్లగుట్టల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో క్యా పద్మక్కతో పాటుగా మరో ముగ్గురు అమరులో కా, మనస కూడా అమరత్వం చెందింది.

లోకేటి చందర్(అలియాస్ స్వామి, అలియాస్ ప్రభాకర్)

పబ్లిషింగ్ తేదీ జనవరి 7. 2026

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్