
జన సముద్రం న్యూస్ ఆగస్ట్ 27 పుల్లల చెరువు.
మండలం సిఐటియు మండలం మహాసభ స్థానిక ఎంఈఓ కార్యాలయం నందు బొజ్జ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి డికేఎం రఫీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా అధికారంలో వచ్చిన వెంటనే స్కీం వర్కర్లందరినీ వేతనాలు పెంచుతామని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని కార్మికులకు హామీ ఇవ్వడం జరిగిందని హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను హరిస్తూ కార్పొరేటర్ లబ్ధి చేకూర్చే విధానాలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 26 000/- ఇవ్వాలని ఆయన అన్నారు. జాతి సంపద అయిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాన్ని మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు. ప్రజల కార్మికులపై భారంగా మోపిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్ల విధానాన్ని మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జాతి సంపద అయిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాన్ని మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు. స్కీం వర్కర్లు అందరినీ రెగ్యులర్ చేయాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన అన్నారు. ప్రజలు ,కార్మికులపై సద్దుబాటు చార్జీల పేరుతో భారంగా మోపిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్ల విధానాన్ని మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు ను పునర్దించి సంక్షేమ పథకాల అమలు చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బొజ్జ వెంకటేశ్వర్లు సుజాత యోగమ్మ నాగమల్లేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో ఏ శ్యామల మంగమ్మ అంజమ్మ బేబీ రాణి కుమారి, సుబ్బులు సరస్వతి , వీర నారాయణమ్మ భారతి, కే కళ్యాణి, అక్కరావు, జయరావు తదితరులు పాల్గొన్నారు . .






