ఒంటిమిట్ట, జన సముద్రం న్యూస్, ఆగస్టు 27:
ఒంటిమిట్ట కోదండరాములు పవిత్రోత్సవాలు మంగళవారం తో వైభవంగా ముగిశాయి
యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 24వ తేదీ యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, ఆగస్టు 25న పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆగస్టు 26న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి.ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు వీణ రాఘవాచారి శ్రవణ్ కుమార్ మనోజ్ కుమార్ పవన్ కుమార్ పాల్గొన్నారు.





