నల్గొండ సైనిక వెల్ఫేర్ కార్యాలయంలో ఉచిత న్యాయ సేవా క్లినిక్‌ను ప్రారంభించిన జిల్లా జడ్జి ఎం. నాగరాజు
దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగం అమూల్యం
జన సముద్రం న్యూస్ ఆగస్టు 27. నల్గొండ జిల్లా
సైనికులు, మాజీ సైనికులు లేదా వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు వచ్చినా, వారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ఈ క్లినిక్ ప్రారంభం.ఈ క్లినిక్‌లో ప్రతి నెలా శనివారం ఒక న్యాయవాది మరియు వాలంటరీ న్యాయవాది జి. శ్రీనివాస్ చక్రవర్తి,పారా లీగల్ వాలంటీర్ శ్రీకాంత్ సేవలు అందించనున్నారు.సైనికులు, మాజీ సైనికులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ క్లినిక్‌ను సందర్శించి తమ సమస్యలు వివరించి న్యాయ సలహాలు పొందవచ్చు అని అన్నారు కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి పి. పురుషోత్తం రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ కట్ట అనంత రెడ్డి, కార్యదర్శి మంద నాగేష్, కౌన్సిల్ మెంబర్ భీమర్జున్ రెడ్డి, సైనిక వెల్ఫేర్ అధికారి టి. వనజ, జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ సభ్యులు, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు






