సుండుపల్లి జనసముద్రం న్యూస్ నవంబర్ 15
శేషచల అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం నరికి రవాణా చేస్తున్న స్మగ్లర్లపై అటవీ సిబ్బంది దాడి చేసి 20 ఎర్రచందనం దుంగలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయ రేంజర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
అన్నమయ్య డీఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ ఆదేశాలు, మదనపల్లి సబ్ డీఎఫ్ఓ ఎస్. శ్రీనివాసులు సూచనల మేరకు రేంజ్ అధికారి వై.సి. రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తాటిగుంటపల్లి వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు. అదే సమయం లో ఒక వాహనం వచ్చినట్లు గమనించి ఆపడానికి ప్రయత్నించగా ఆగకపోవడంతో వెంటాడి సిద్ధారెడ్డిగారిపల్లి వద్ద వాహనాన్ని నిలిపారు.
వాహనంలో ఉన్న ఇద్దరు స్మగ్లర్లు పరారైనట్లు తెలిపారు. వాహనాన్ని పరిశీలించగా 626 కిలోల బరువున్న 20 ఎర్రచందనం దుంగలు, ఇన్నోవా (నెం. KA 03 MF 5813) బయటపడ్డాయి. దుంగలు, వాహనం కలిపి విలువ సుమారు ₹10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ దాడిలో సానిపాయ ఎఫ్‌ఎస్‌ఓ రజనీ, ఎఫ్‌బిఓ లీలాశ్రీహరి, సానిపాయ స్ట్రైక్‌ఫోర్స్ సిబ్బంది, బేస్‌క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.





