
మల్కాజిగిరి జనసముద్రం న్యూస్ నవంబర్ 15
కేసు వివరాలకు వెళితే పాస్తం ఎల్లేష్ మరియు పాస్తం మంగ కి సుమారు 19 సంవత్సరాల క్రితం వివాహం జరిగినది. వీరికి ముగ్గురు సంతానం కలరు. ఇద్దరి కూతుర్లు వివాహం చేసుకొని అత్తగారింటికి వెళ్లిపోయారు. కుమారుడు సంపత్ సెంట్రింగ్ పని చేస్తుంటాడు. నేరస్తుడు అయిన ఎల్లయ్య మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడి భార్యని హింసించేవాడు. పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. విసిగిపోయిన భార్య మంగ 2023 సంవత్సరంలో మొదటగా భర్తపై గృహింస కేసు పెట్టడం జరిగినది. అయినప్పటికీ అతనిలో మార్పు రాకపోవడంతో భర్తకు దూరంగా వినాయక్ నగర్లో నివసించేది. భర్త ఎల్లయ్య జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో ఉండేవాడు. భార్యపై కక్ష పెంచుకున్న నేరస్తుడైన ఎల్లయ్య దినము 26. 12. 2023 రాత్రి సమయంలో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి భార్య మంగని గొంతు పిసికి చంపి పారిపోతాడు. కొడుకు సంపత్ ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేస్ నమోదు చేసి నేరస్తుని రిమాండ్ కు తరలించడం జరిగినది. దర్యాప్తు ముగిసిన తర్వాత గౌరవ న్యాయస్థానం నందు చార్ట్ సీట్ ఫైల్ చేయడం జరిగినది. గౌరవనీయులైన ఫోర్త్ అడిషనల్ జడ్జ్ , మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ న్యాయస్థానం వారు కేసును విచారణ జరిపి నేరస్తుని యొక్క నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు చేయించడం జరిగినది. గవర్నమెంట్ తరఫున ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ కోమలత గారు వాదించడం జరిగినది. కేసు కన్వెన్షన్ రావడం కోసం కృషిచేసిన కోర్ట్ కానిస్టేబుల్ అన్వర్, సమన్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మరియు రైటర్ అనిల్ ని అభినందించడం జరిగినది.






