
జన సముద్రం న్యూస్
పల్నాడు జిల్లా ప్రతినిధి
జులై 26.
పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో మాచర్ల నందు ది.25.07.2025 తేదీ నాడు జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట వారి ఆధ్వర్యంలో రైతు శిక్షణ కేంద్రం నిర్వహించారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్ర వ్యవసాయ అధికారి ఎం అరుణ మాట్లాడుతూ నేల ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రణామ్ లో భాగంగా రసాయన ఎరువులను వాడకాన్ని తగ్గించి సేంద్రియ జీవన ఎరువులను వాడి తే నేల కు చాలా అనుకూలంగా ఉంటుందని పంట దిగుబడి పెరుగుతుందని తెలిపారు. దీనివలన సూక్ష్మ పోషకాలు మొక్కలకు బాగా అందటంతో పాటు నేలలోని భాస్వరాన్ని మొక్కలకు అందజేయడం ఎండు తెగుళ్లు రాకుండా ఉండటం జరుగుతుందని తెలిపారు.
అనంతరం మాచర్ల మండల వ్యవసాయ అధికారి డి పాప కుమారి మాట్లాడుతూ రైతులు అందరూ పత్తి పంటలో బోర్డర్ క్రాప్ గా జొన్న లేదా మొక్కజొన్న పైరును ఒక వరుసలో నాటుకున్నట్లయితే రసం పీల్చు పురుగుల భారీ నుండి ప్రతి పంటను కాపాడుకోవచ్చు అని సూచించారు. మెట్ట పైరు వేసే ముందు పచ్చి రొట్ట పైరును సాగు చేసినట్లయితే భూసారాన్ని పెంచుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎం మార్కండేయులు జి ప్రతాప్ కుమార్ అంజి నాయక్ మాచర్ల మండల రైతు సేవా కేంద్రాల సిబ్బంది రైతులు పాల్గొన్నారు.