
జనసముద్రం న్యూస్, మదనపల్లి, జులై 26:- మదనపల్లె టమోటా మార్కెట్లో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి 2టౌన్ పోలీసుల కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశిగంజ్ జిల్లా, నంగులా తానాకు చెందిన మోర్ సింగ్50,అదే ఊరికి చెందిన మరో 80మందితో ఐదేళ్ల క్రితం మదనపల్లికి వచ్చారు. బ్రతుకుతెరువు నిమిత్తం టమోటా మార్కెట్ యార్డులోని ఎల్టిసి మండిలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి లారీ రివర్స్ రావడంతో కిందపడి మృతి చెందాడు.