
డాక్యుమెంటేషన్ త్వరితగతిన అప్లోడ్ చేయండి.
అధికారులు ప్రతివారం వసతి వసతి గృహాలను సందర్శించాలి.
ఈ కే వై సి పూర్తి చేయాలి.
జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్
పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,జూలై 26:-
బంగారు కుటుంబాలు,మార్గదర్శకులను గుర్తించడంలో వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పి4, బంగారు కుటుంబాల దత్తత, మార్గదర్శుల ఎంపిక,నమోదు, గ్రామసభలు,ప్రభుత్వ పథకాల సేవలు,ప్రజాస్పందనలు వంటి వివిధ అంశాలపై ఆర్డీవోలు, నియోజకవర్గ,మండల స్పెషల్ ఆఫీసర్లు,ఎంపీడీవోలు, తహశీల్దార్లు తో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ బంగారు కుటుంబాల దత్తత, మార్గదర్శుల ఎంపిక,నమోదు క్షేత్రస్థాయిలో వేగవంతంగా పూర్తిచేసి తప్పక ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. అందరూ అధికారుల సమన్వయంతో గ్రామ సభలను నిర్వహించి వారి వద్ద నుండి సానుకూల ప్రజా స్పందనలను సేకరించాలని అన్నారు.ఆయా క్షేత్రస్థాయిలో ఉన్న కార్యాలయాల డాక్యుమెంటేషన్ అప్లోడింగ్ వేగవంతంగా చేయాలని అన్నారు.సచివాలయాలలో బదిలీలు జరిగిన కారణంగా లోటుపాట్లు లేకుండా ఆగస్టు 1వ తేదీన పెన్షన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఏమాత్రం నిర్లక్ష్యం,జాప్యం చేయకుండా ఉండాలన్నారు. ఆయా మండలాలలో ఉన్న వసతి గృహాలకు అధికారులు వారంలో ఒక మారు సందర్శించి త్రాగునీరు సరఫరా,నీటి పైపులైన్ల మరమ్మతులు తదితరాలు తనిఖీ చేసి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అన్నారు.అలాగే ప్రస్తుతం సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా వసతి గృహాల్లో ఉన్న విద్యార్థినీ విద్యార్థులు తప్పక నీటిని వేడి చేసి చల్లార్చి త్రాగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఆయా మండలాల ఎంపీడీవోలు తల్లికి వందనం కొరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈకేవైసీ వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.మైగ్రేషన్ నాణ్యతగా చేయాలని పొరపాట్లకు తావివ్వరాదని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సేవలపై ప్రజల నుండి సానుకూల ప్రజాస్పందనలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ విజయకుమార్,డి ఆర్ డి ఎ పి డి నరసయ్య,ఎస్ డి సి లు సూర్యనారాయణ రెడ్డి, రామసుబ్బయ్య,సాంఘిక సంక్షేమ శాఖ డిడి శివ రంగ ప్రసాద్,ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, సర్వ శిక్ష పిఓ జయరాజు, డిప్యూటీ సీఈఓ,జెడ్పి తదితర అధికారులు,తదితరులు పాల్గొన్నారు.