
కదిరి,జన సముద్రం న్యూస్, జూలై 26:-
భారతీయ జనతా పార్టీ కదిరి అసెంబ్లీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు శుక్రవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎన్జీవో ఆఫీస్ నందు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఈనెల 31వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అధ్యక్షుడి హోదాలో పుట్టపర్తికి విచ్చేస్తున్న సందర్భంగా వారి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపులు గంగాధర్,పి టి ఆంజనేయులు,జిల్లా జనరల్ సెక్రటరీ ఓబులేసు,రేపల్లె రామకృష్ణ,గొడ్డెన్ల వెంకటేష్,సుదర్శన్,కడపల సోమశేఖర్,వేణుగోపాల్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు పీట్ల రామకృష్ణ,మండల అధ్యక్షులు వెంకటేష్,బాబ్జాన్, వేమనారాయణ,రమేష్, ఆనంద్,కొత్త రమేష్ బాబు,షేక్ సమీవుల్లా,అశోక్ బాబు, కృష్ణవేణి అమ్మ,కిష్టప్ప, నాగార్జున,సురేష్ గోపి,నరేష్ మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.