
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థలో జరిగిన అవినీతిని వెలికి తీయాలి
2019 – 24 మధ్య వసూలు చేసిన 1500 కోట్లను వెనక్కి తిరిగి చెల్లించాలి
2024… 25 మధ్య బలవంతంగా వసూలు చేసిన 2,787 కోట్లను రద్దు చేయాలి : సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్
జనసముద్రంన్యూస్, పల్నాడు జిల్లా,నర్సరావుపేట, జూలై 26;
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలోని ఏంజెల్ టాకీస్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి కరెంట్ చార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లలను రద్దు చేయాలని, షిర్డీసాయి ఎలక్ట్రికల్ సంస్థలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీయాలని బలవంతంగా బిగిస్తున్న స్మార్ట్ మీట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పేద మధ్యతరగతి ప్రజల పైన కరెంట్ చార్జీల భారాన్ని విపరీతంగా పెంచుతుందని స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను ఆదాని కంపెనీ నిలువు దోపిడీ చేస్తుందని వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిహెచ్ సత్యనారాయణ రాజు, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ కే చిన్న జాన్ సైదా, సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, మహిళా సమైక్య కార్యదర్శి ఎస్.దేవి, సిపిఐ నాయకులు నాగేశ్వరావు, మదన్మోహన్, నాగూర్, అంకారావు, కోటి తదితరులు పాల్గొన్నారు.