
పుల్లల చెరువు,జులై 26 జనసముద్రం న్యూస్.
మండల కేంద్రమైన పుల్లలచెరువు లో కాలం చెల్లిన స్తంభాలు,తీగలను మార్చాలని మల్లపాలెం ఎంపిటిసి లింగంగుంట్ల.రాములు అన్నారు.స్థానిక ఎంపిడివో కార్యాలయ సమావేశ భవనంలో ఎంపిపి కందుల.వెంకటయ్య అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది.ఎంపిటిసి రాములు మాట్లాడుతూ, చాలా ఏళ్ల క్రితం స్తంభాలు,తీగను వేశారని,వాటిని మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.గ్రామంలో వీధి లైట్లు లేవని దీంతో గ్రామస్థులు చీకట్లో మగ్గుతున్నారని ఆయన ఆరోపించారు.పుల్లల చెరువు లో ప్రధానమంత్రి జలజీవన్ పధకం ద్వారా గ్రామంలో ఇంటింటి కి కుళాయి వేసినా ముటుకు ల ప్రాజెక్ట్ ద్వారా నీరు రావడంలేదని ఆయన ఆరోపించారు. పుల్లల చెరువు లో గతంలో వేసిన విద్యుత్ స్తంభాలు,తీగెలు మార్చామని ఇంకా ఏమైనా ఉంటే పాత వాటిని తొలగించి కొత్త స్తంభాలు,తీగెలను ఏర్పాటు చేస్తామని విద్యుత్ ఏఈ పి.కిషోర్ అన్నారు. ప్రధాన మంత్రి జల జీవన్ మిషన్ పధకం ద్వారా పుల్లల చెరువులో కొంతవరకు నీరండిస్తున్నామని,మిగిలిన వీధులకు కూడా నీరంధిస్తామని ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ తెలిపారు.కాటివిరన్న చెరువు కట్టమీదగల దిబ్బలు,బంకుల ను తొలగించాలని, సచివాలయం 1 వర్షపు నీటి తో నిండిందని,పైన ఉన్న నీరు కిందికి వెళ్లేందుకు పైపులు వేయాలని ఎంపిటిసి మెడికొండ.రాధాకృష్ణ ఎంపిడివో దృస్తికి తెచ్చారు.వెంటనే స్పందించిన ఎంపిడివో శ్రీనివాసులు వారం రోజులలోసచివాలయం లో పైపులు ఏర్పాటుచేయాలని,కాటివిరన్న చెరువు కట్ట మీద ఉన్న దిబ్బలు,బంకులు తొలగించాలని ఇంచార్జ్ ఈవోఆర్డ్ నలగాటి.సత్యనారాయణ ను ఆదేశించారు.చౌటపల్లి,నరసాపురం,.మానేపల్లి,కవలకుంట్ల లోవున్న రైతుల భూములు ఇనాం భూములుగా చూపుతున్నాయని,కానీ నేటికీ సమస్య పరిష్కారం కాలేదని పుల్లల చెరువు ఎంపిటిసి 1 మెడికొండ.రాదజాకృష్ణ అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కందుల.వెంకటయ్య, జడ్పిటిసి వాగ్యనాయక్ వైస్ ఎంపిపి లింగంగుంట్ల.రాములు,ఎంపిడివో శ్రీనివాసుల,ఇంచార్జి ఈవోఆర్డీ నలగాటి.సత్యనారాయణ,పీఆర్ ఏఈ రవీంద్రారెడ్డి,విద్యుత్ ఏఈ కిషోర్,ఇర్రిగేషన్ ఏఈ చంద్రశేఖర్ యాదవ్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ శ్రీకాంత్, హౌసింగ్ ఏఈ జాన్ సుందర్,ప్రభుత్వ వైద్యాధికారి శ్రీనాధ్,పశు వైద్యాధికారి నాగులమీరా,ఐసిడిఎస్ సూపరవైజర్లు సుజాత,విజయలక్ష్మి బాయి, సర్పంచులు,ఎంపిటిసిలు,పంచాయతీ కార్యదర్సులు పాల్గొన్నారు.