
జనసముద్రం ప్రజా ప్రతినిధి జొన్నార మండలం
జులై 26 శుక్రవారం రోజున గత పది రోజుల నుండి అటవీ శాఖ విధించిన భారీ వాహనాల రాకపోకలను ఎత్తివేయాలని నిరాహారదీక్షకు పాల్గొంటున్న జన్నారం మండలానికి చెందిన భూమా చారి అజ్మీర బద్రి నాయక్ వారు చేస్తున్న దీక్షకు మద్దతుగా నేడు జన్నారం మండలంలోని అన్ని షాపులను స్వచ్ఛందంగా మరియు పాఠశాలలను మూసివేశారు అనంతరం ఖానాపూర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ దీక్షకు మద్దతు తెలుపుతూ భారీ వాహనాల రాకపోకలను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని యధావిధిగా మంచిర్యాల నుండి ఆదిలాబాద్ నిర్మల్ భారీ వాహనాలను నడిపే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని లేనియెడల దీక్షను ప్రభుత్వం దిగచ్చేంత వరకు దీక్ష కొనసాగుతుందని ఆయన వెల్లడించారు ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బిజెపి పార్టీ నాయకులు మరియు ఇతర సంఘాల నాయకులు స్వచ్ఛంద బందులో పాల్గొన్నారు