
జనసముద్రంన్యూస్, జూలై 26కారంపూడి;
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని మండల కేంద్రమైన కారంపూడి తో పాటు మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ తో కలసి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా కారంపూడి లోని మాచర్ల రోడ్ లో గల ఎస్సీ కాలనీలో 15 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆ కాలనీలోనే ముగ్గురు నేతలు సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా అక్కడ ప్రజలను కలుసుకొని సమస్యలను తెలుసుకుని తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు. అనంతరం మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో కారంపూడి రోడ్ లో గల బీసీ కాలనీలో ఒడియ రాజుల కొరకు 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో ముస్లింల కొరకు 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాలు కూడా శంకుస్థాపన చేసిన అనంతరం,మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పరిపాలనలో చేసిన అప్పుల వలన రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కొంచెం ఆలస్యమైంది కానీ, అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఆగనివ్వకుండా కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తూ ముందుకు సాగుతుందని వివరించారు. గత పరిపాలనలో జరిగిన వినాశనాన్ని సరిచేసుకుంటూ సూపర్ సిక్స్ లోని హామీలను అన్నిటినీ నెరవేర్చడానికి మన ముఖ్యమంత్రి ఎంతో కష్టపడుతున్నారని, ప్రజలందరూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరారు. స్థానిక శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరి కోరికలను తీర్చడానికై కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు,. ఎన్నికల సమయంలో మేము ఇచ్చిన హామీల్లో భాగంగా అన్ని వర్గాలకు కమ్యూనిటీ హాల్స్ ను నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ లో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ప్రత్యేక ఉచిత బస్సుల సౌకర్యాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టబోతున్నాడని చెప్పారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పంగులూరి పుల్లయ్య, పంగులూరు అంజయ్య, గాడిపర్తి రమాదేవి పూర్ణయ్య, గోళ్ళ సురేష్ యాదవ్, కారంపూడి పట్టణ టిడిపి మాజీ అధ్యక్షుడు కటికల బాలకృష్ణ , బొమ్మిన శేషగిరిరావు, రామావత్ సరస్వతి బాలునాయక్, పలిశెట్టి రాఘవ నాయుడు, జనసేన నాయకులు భూసా రామాంజనేయులు, కేసానుపల్లి కృష్ణ, బిజెపి నాయకులు శెట్టి హనుమంతరావు మరియు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.