
జన సముద్రం న్యూస్, భీమారం జులై 26 : భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి శుక్రవారం రోజునమెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో ఓపిలో పరీక్షించిన 61 మందికి అవసరమైన మందులను పంపిణీ చేశారు, 8 మంది రక్త నమూనాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. వర్షాకాలంలో నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వసుంధర, ఏఎన్ఎం ఎ. సుజాత, ఎం ఎల్ హెచ్ పి అప్సర, మానస, ఆశా వర్కర్లు ఎ. లక్ష్మి, డి. స్వరూప పాల్గొన్నారు.