హైదరాబాద్ లో దారుణం..10 తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

Spread the love

హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. ఒక పదోతరగతి విద్యార్థినిని తోటి విద్యార్థులే గ్యాంగ్ రేప్ చేశారు. ఐదుగురు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీడియో తీసి మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాకపోతే సోషల్ మీడియాలో పెడుతామంటూ బెదిరించారు. ఈ దారుణం హయత్ నగర్ లోని తట్టిఅన్నారంలో చోటుచేసుకుంది.

పదోతరగతి విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారం చేశారు. అత్యాచారం సమయంలో నిందితులు వీడియోను తీశారు. ఈ విషయంపై ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడుతామంటూ బెదిరించారు.

పదిరోజుల తర్వాత మరోసారి ఐదుగురు నిందితులు అత్యాచారం చేశారు. అత్యాచారం వీడియోను నిందితులు తోటి విద్యార్థులకు పంపారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.అప్పటి వీడియోను నిందితులు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బాధితురాలి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నిందితులు అంతా మైనర్లే కావడంతో వారిని జువైనల్ హోమ్ కు తరలించారు.ఇక గతంలోనూ ఒక యువతిని కార్ లో ఇలాగే గ్యాంగ్ రేప్ చేశారు. ఇప్పుడు కూడా విద్యార్థిని ఇలాగే మాయమాటలు చెప్పి అఘాయిత్యం చేశారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని.. పురుషుల వలలో పడవద్దని పలువురు హితవు పలుకుతున్నారు.

Related Posts

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

Spread the love

Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

Spread the love

Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి