
వెల్దండ,జూన్,16(జనసముద్రం న్యూస్)
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలందరూ గ్రామాలలో గెలుపే లక్ష్యంగా కలిసి కట్టుగా పనిచేసి గెలుపొందాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు,మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి రెడ్డి ఆదివారం ఆయన నివాసంలో సుధీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ క్రియాశీల పాత్ర పోషితున్నా నాయకులతో సమావేశమైన సందర్భంగా ఆయన తెలిపారు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలను గ్రామీణ ప్రాంతాలలో ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి దిశగా ప్రతి ఒక్కరూ పనిచేసి సత్ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే నిఖార్సైన ఏ కార్యకర్తను వదులుకోకుండా ప్రభుత్వంలో,పార్టీలలో సముచిత స్థానం దక్కుతుందని ఆయన దిశానిర్దేశం చేశారు.
రాబోయే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయి నుండి మండల స్థాయిలో హోదాలను మించి కార్యకర్తగా భావించి ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నేతృత్వంలో గ్రామ,గ్రామాన ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
మండలంలో రాజకీయ పరిస్థితులు,ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయన అరా తీశారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్,బిజెపి పార్టీలు అనాలోచిత,విష ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విషం కక్కుతున్న విధానాలను ప్రజా వేదికలో,ప్రజల్లోతిప్పికొట్టాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి తక్కళ్ళపల్లి శేఖర్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ముదిగొండ రమేష్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్ర శ్రీను ముదిరాజ్,మండల యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు