
( జనసముద్రం న్యూస్ ఉమ్మడి కరీంనగర్ స్టాప్ రిపోర్టర్ )
జగిత్యాల జిల్లా కోరుట్ల లో విద్యుత్ షాక్ ప్రమాదంలో గాయపడిన వారికి పరామర్శ
మృతి చెందిన మృత దేహాలను సందర్శించిన
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు,.మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

కోరుట్ల పట్టణ మెట్పల్లి రోడ్డులో గల బాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో ఆదివారం విద్యుత్ ప్రమాదం సంభవించింది భారీ వినాయక విగ్రహాలను ఒక చోటి నుండి మరో చోటికి తరలిస్తుండగా 33 కెవి విద్యుత్ వైర్లు తాగడంతో ప్రమాదం సంభవించింది ఇట్టి ప్రమాదంలో 9 మంది గాయపడగా వారిని హుటా హుటిన కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు , మరో ఇద్దరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇట్టి మృతదేహాలను గాయపడిన వారిని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, మాజీమంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి మృతదేహాలను సందర్శించి అనంతరం గాయపడిన వారిని పరామర్శించారు , మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ద్వారా ప్రకటించారు.