
జనసముద్రం న్యూస్ : జూన్ 15 ( పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ )
సింగరేణి స్టేడియం లో ఉదయం 06:00 గగంటల నుండి 8:00 గంటల వరకు రోజు కోతులు మందలు మందలుగా రావడంతో స్టేడియంకు వాకింగ్, జీమ్,యోగ మరియు ఇతర వ్యాయామాలకు వచ్చే మహిళలు, వృద్దులు మరియు యువతీ యువకులు మీది కోతులు వచ్చి భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి కావున రామగుండం నగర పాలక సంస్థ వెంటనే స్పందించి కోతులను స్టేడియం నుండి దూరంగా ఉన్న అడివులలోకి తరలించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ అధికారులను కోరారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థలోని ఇంజనీరింగ్ విభాగం టెండర్ల ద్వారా ఒక ఏజెన్సీకి కోతుల బెడద తీర్చడానికి 10 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలవడం అభినందనీయం అని, టెండర్ దక్కించుకున్న ఏజెన్సీ బుధ , గురువారాల్లో, శుక్రవారల్లో రామగుండం రైల్వే స్టేషన్ తోపాటు పరిసరాలలో ఉన్న కోతులను పట్టి పoజరాలలో బంధించి దూరప్రాంతలైన అడవిలకు వదిలేయడం శుభపరిణామని అన్నరు. అదే విధంగా కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో ఇండ్ల వైపు కోతులు తిరుగుతుంటే ప్రజలు జంకుతున్నారని ముఖ్యంగా 5వ ఇంక్ లైన్ చుట్టు ప్రక్కల డివిజన్ల లో ముఖ్యంగా 33వ డివిజన్ లో ఇండ్ల మీదికి ఇంట్లో ఉన్న చెట్ల పైకి రేకుల మీదికి వచ్చి నాన హంగామా సృష్టిస్తూ కోతులు ప్రజలను తివ్ర ఇబ్బందులకు చేస్తున్నాయని కావున కొన్ని రోజులు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలని అధికారులను దినేష్ డిమాండ్ చేసారు.