జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం జూన్ 15 మెదక్ జిల్లా
చిన్న శంకరంపేట మండలంలో మూడు రోజులుగా సాగిన వెంకట్రావుపల్లి ప్రీమియర్ లీగ్ తుది పోరులో వెంకీ వారియర్స్, ఎస్ఏఎల్ కింగ్స్ తలపడగా వెంకీ వారియర్స్ జట్టు విజయం సాధించింది. వెంకీ వారియర్స్ కెప్టెన్ వెంకటస్వామి మాట్లాడుతూ ఈ విజయం మా టీమ్ యొక్క సమిష్టి కృషి అన్నారు. అలాగే ఈ విజయం మాకుఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలుపుతూ మా గ్రామంలో ఈ లీగ్ ప్రతీ ఏటా నిర్వహించుకుంటూ ఆటలలో గ్రామ యువకులను ప్రోత్సహిస్తామని తెలిపారు.





