- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి(జనసముద్రం న్యూస్)
గర్భిణీ స్త్రీలకు పౌష్టికమైన ఆహారాన్ని అందించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి పట్టణంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం శుక్రవారం సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందించే పోషక పదార్థాలను సక్రమంగా గర్భిణీ స్త్రీలకు పిల్లలకు అందేలా చూడాలన్నారు.ఈ సందర్భంగా ఇప్పనపల్లి చారి ట్రబుల్ ట్రస్ట్ఆధ్వర్యంలోమున్సిపల్ వైస్ చైర్ పర్సన్ఇప్పనపల్లి విజయలక్ష్మి సాంబయ్యఆధ్వర్యంలో వందమంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ చైర్మన్ కొత్తూరి మహేష్, జిల్లా వెల్ఫేర్ అధికారి సరస్వతి, ప్రోగ్రాం ఆఫీసర్ సాజీద, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఎస్సై అనూష, సిడిపిఓ కస్తూరి, ఏసిడిపిఓ నర్సింగా రాణి, సూపర్వైజర్ రమాదేవి పాల్గొన్నారు.