జనసముద్రం న్యూస్,ప్రకాశరావు పేట,విశాఖపట్నం,జనవరి8:
సెయింట్ పీటర్స్ హై స్కూల్ 10న్త్ క్లాస్ పూర్వ విధ్యార్థుల ఆత్మీయ కలయిక గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించారు,,సుమారు 120మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు,,తామంతా 1986 – 1987 టైమ్లో సెయింట్ పీటర్స్ హై స్కూల్లో వివిధ సెక్షన్స్ లో 10 వ తరగతి వరకు చదివి ఉత్తీర్ణత సాధించి పెద్ద పెద్ద చదువులు ఈనాడు తామంతా రక రకాల ఉద్యోగ ల్లో స్థిరపడ్డామని చెప్పారు,పోలీస్ కమిషనర్లుగ డాక్టర్లుగ రాజకీయ నాయకులుగా అగ్రికల్చర్ అధికారులుగా విజిలెన్స్ ఆఫీసర్లు గా ఉపాధ్యాయులుగా ఇండియన్ రైల్వేస్ పోర్ట్ డాక్యార్డ్ లోని వివిధ రకాల సాప్ట్ వేర్ కంపెనీల్లో విధులు నిర్వహిస్తున్నామని తామంతా నూతన సంవత్సరం ప్రారంభం లోని మొదటి వారంలో వొచ్చే ఆదివారం రోజున తామంతా నగరంలో ఎక్కడో ఒక చోట ఆత్మీయ కలయిక పెట్టుకొని తామంతా కలుసుకోని చిన్ననాటి జ్ఞాపకాలను స్కూల్లో తాము చేసిన అల్లరి చేష్టలను గుర్తుకు తెచ్చుకొని ఆనందం పొందుతూ వుంటామని పలువురు పూర్వ విద్యార్థులు చెప్పారు.
ఈనాడు జరిగిన ఆత్మీయ కలయిక సందర్భముగా తమతో చిన్ననాడు చదువుకొని తమ సహా పూర్వ విద్యార్ధి విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న చిరువోలు శ్రీకాంత్ ఐ పి యస్ కు సన్మానం చేశామని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు ప్రసన్న చెప్పారు,మరో పూర్వ విద్యార్థి కోడి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ఈ రోజున అడ్వకేట్ గా స్థిరపడ్డాననీ తాను ఇప్పుడు త్వరలో జరుగుతున్న శాసన మండలి పట్ట భద్రుల యమ్మెల్సి ఎన్నికల్లో తాను అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు,తనను అందరూ ఓల్ట్లు వేసి గెలిపించాలని కోరారు,,పూర్వ విద్యార్ధి జోసెఫ్ మాట్లాడుతూ తనకు కోవిడ్ టైమ్లో తాను అస్వస్తతకు లోనైనప్పుడు తనకు తన యొక్క సహచర పూర్వ విద్యార్థులు తనకు సహాయ సహకారాలు అందించడం వలనే తాను కోలుకున్నననీ చెప్పారు,,అనంతరం మరో పూర్వ విద్యార్ధి డాక్టర్ గేదెల సూర్య రామ్ మాట్లాడుతూ తాను ఎప్పుడు తన యొక్క సహచర విద్యార్దులకు ఎప్పుడు అందుబాటులో వుంటానని వైద్య పరమైన ఏటువంటి సాయం అయిన తాను అందించటానికి సిద్దంగా వుంటానని చెప్పారు,,ఈ కార్యక్రమం సందర్భముగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో వెండ జగన్ మోహన్(జై బాలయ్య), ఈరోతి కృష్ణ లు వేసిన నృత్యాలు ఎంతగానో ఆకర్షించాయి,,విద్యార్థులు అందరూ డీజే సాంగ్స్ కు ఆనందంతో కేరింతలు కొడుతు ఒకరికి ఒకరు ఉత్సాహ పరుచుకుంటూ స్టెప్పులు వేశారు,ఈ కార్యక్రమంలో పైల రాజు,జోసెఫ్,ఫణి భూషణ్, శంఖర్, కర్రీ శ్రీను, తేలు ప్రకాష్,సీత రామా శాస్త్రి,విక్రంత్, గండ్రెడ్డి శ్యామ్,జి వి సమ్యూల్ రాజు ,మహంతి కృష్ణ,సలీం,గెడ్డం రాజశేఖర్,కళ్యాణ్, గార్భాపు విజయ శేఖర్, యలమంచిలి విజయ్, మరియు మహేంద్ర(మహి)తదితరులు హాజరయ్యారు,,ఈ కార్యక్రమనికి అర్ ఏ పి కే ప్రసన్న మరియు ప్రముఖ టిడిపి మధవధరా నాయకులు సనపల మోహన్ అధ్యక్షత వహించారు