జన సముద్రం న్యూస్,అనంతపురం రూరల్,జనవరి8:
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన చియ్యేడు సింగిల్ విండో ప్రెసిడెంట్ పూలకుంట శివారెడ్డి కుమారుడు చరణ్‌రెడ్డి భౌతికకాయానికి అశ్రునయనాల మధ్య ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. శివారెడ్డి కుమారుడు చరణ్‌రెడ్డి ఈనెల 5న బెంగళూరు నుంచి బైకులో వస్తూ బాగేపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన చరణ్ బెంగళూరులోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయాడు. భౌతికకాయాన్ని ఆదివారము ఉదయం గ్రామానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం అంతక్రియలు నిర్వహించారు. వైఎస్ఆర్సిపి నాయకులు తోపుదుర్తి ఆత్మరామిరెడ్డి , తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి , ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ బోర్డు మెంబర్ తోపుదుర్తి నయనతారెడ్డి మరియు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చరణ్ రెడ్డి భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. శివారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.