అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్ ను పరిమితిలోనే వాడండి
ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించండి.. రహదారులపై వాహనాలను అడ్డుగా నిలపవద్దు
నిమజ్జన సమయంలో.. పోలీసుల సూచనలు, మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించండి
మద్యపానం తాగి వేడుకల్లో పాల్గొనవద్దు
చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపండి
సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ ఆగస్టు 27 జనసముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా వినాయక చవితి వేడుకలు జరుపుకుందాం… జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్, చెప్పుకొచ్చారు
వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ .
“గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలి. ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగి విజయాలు సిద్ధించాలి” అని ఆయన ఆకాంక్షించారు.
ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రజలను ఉద్దేశించి వినాయక చవితి వేడుకలు, గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషకర వాతావరణంలో నిర్వహించుకోవాలని, పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు..







