జనసముద్రం న్యూస్ మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 27:
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అప్పుడే సమాజం బాగుంటుందని జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ జనరల్ మేనేజర్ కె. శ్రీనివాసులు అన్నారు, మంగళవారం రోజున జైపూర్ మండలంలో ఎల్కంటి గ్రామంలో సింగరేణి వైద్య విభాగం ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు అందజేశారు, ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) డి. కిరణ్ బాబు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాగూర్ మోహన్ సింగ్, ఎస్ ఓ టు జిఎం ఎం. బండారి శంకర్, వైద్యాధికారి రవీందర్, సీనియర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు







