జనసముద్రం న్యూస్ ఆగస్టు 27: డిండి :-
నల్లగొండ జిల్లా గుండ్లపల్లి డిండి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో అంగరంగ వైభవంగా శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను కాలనీవాసులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా మహిళలు బోనం ఎత్తుకొని డప్పు చప్పుల్లు,డిజె పాటలతో గ్రామ పురవీధులలో శోభాయాత్ర నిర్వహించి బొడ్రాయి వద్దకు చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్దకు చేరుకొని పాడిపంటలతో,పిల్లాపాపలతో,సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో హుస్సేన్, సాయిలు,రామస్వామి, గంగయ్య,యాదగిరి, వెంకటయ్య, బాలయ్య,వెంకటయ్య,గోవర్ధన్,అర్జున్,ఉతుకాంత్,రాములు,కె. రాము,తేజ,గణేష్, సాయిబాబు,వెంకటేష్,మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.








