
మాచర్ల జన సముద్రం న్యూస్ అక్టోబర్ 06.
దసరా శరన్న వ రాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని మాచర్ల పట్టణంలో పలు దేవాలయాల్లో బతకమ్మ ఉత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక శ్రీ కోదండరామ దేవాలయంలో, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో, షరాబు బజార్లో ఆర్యవైశ్య మహిళలు బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మహిళలు వివిధ రకాల పూలతో బతకమ్మలు తయారుచేసి మేళ తాళాలు తో దేవాలయాలకు ఊరేగింపుగా వెళ్తున్నారు. దేవాలయంలో మహిళలు ఆలపిస్తున్న పాటలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ మహిళలు గీతాలు ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోదండ రామాలయం కమిటీ నిర్వాహకులు విడియాల సుందర రావు, పోలిశెట్టి పిచ్చయ్య, చిల్లం చర్ల సత్యనారాయణ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ కమిటీ అధ్యక్షులు భవనాసి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.