ఆంధ్రులకు శాశ్వత రాజధాని కావాలి – ఐదేళ్లకో కొత్త రాజధాని మాకొద్దు! …. జూలకంటి వెంకట పుల్లారెడ్డి, దుర్గెంపూడి నరేంద్ర రెడ్డి

Spread the love

జనసముద్రంన్యూస్, మే 31, వెల్దుర్తి ;

ముగ్గురు నాయకులు కలిసి ఆంధ్రులకు ఒక స్థిరమైన, శాశ్వత రాజధానిని ఏర్పాటు చేయండి. ఐదేళ్లకు ఒకసారి మారే రాజధాని మాకు అవసరం లేదు. ప్రజలను ప్రయోగాల కోసమే అనుకోవడం మానేయండి!
మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఆంధ్రులు త్యాగం చేశారు. తెలంగాణతో కలిసినప్పుడు కూడా, “తెలుగు వారందరం కలిసి ఉండాలి” అని ఆశించి హైదరాబాద్‌ను రాజధానిగా అంగీకరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు విడిపోయి 11 ఏళ్లు అవుతున్నా, ఇప్పటికీ మనకు ఒక స్పష్టమైన రాజధాని లేదు. ఇది ఎంత నిరాశకరం, ఎంత అవమానకరం తెలుసా?
ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రాజధానిని తమ రాజకీయం కోసం మార్చడం దారుణం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవడం మానండి. ఒకే చోట ఒక శాశ్వత రాజధానిని నిర్మించండి — అది రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, రహదారి, రైలు, ఇతర వనరులకి అందుబాటులో ఉండాలి. ఇది ఎవరూ మార్చలేని విధంగా చట్టబద్ధతతో, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒక సంవత్సరంలోనే నిర్మించాలి.
హైదరాబాద్‌ను కోల్పోయిన తర్వాత మాకు భవిష్యత్ ఆందోళనగా మారింది. ఇంకెంతకాలం ఈ అస్థిరత? ఇకపై ఆంధ్రులకు మరో నిరాశను మిగిలించకండి
అని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మండల కేంద్రమైన వెల్దుర్తి కి చెందిన జూలకంటి వెంకట పుల్లారెడ్డి మరియు దుర్గెంపూడి నరేంద్ర రెడ్డి అన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్