
జనసముద్రం న్యూస్, మదనపల్లె, 20 మే 2025:-
కాళ్ళు చేతులు కట్టేసి, మెడకు త్రాడు బిగించి హత్యచేసి, అత్యంత కిరాతకంగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆమె హత్యకు కారణమైన ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్. ఎటువంటి ఆనవాళ్లు దొరకకుండా చేశారు. అయితే అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో, డాగ్ స్క్వాడ్ ద్వారా, నిందితులను గుర్తించి అరెస్ట్ చేశాం. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ, శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ డివిజన్ మదనపల్లి రూరల్ సర్కిల్ రామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని 11/5/2025 వ తేదీన, చెంబుకూరు ఎలకపల్లి రహదారిలో ఓ మహిళ కాలిన గాయాలతో చనిపోయి ఉందని వీఆర్వో అనూష ఫిర్యాదు మేరకు, రామసముద్రం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అంతట కాలిన శరీరం యొక్క కుడి చేతి మీద వున్న పచ్చబొట్టు “యస్మిత” అన్న పేరును గుర్తించి దాని ద్వారా దర్యాప్తు చేయగా పోలీసువారి విచారణలో హత్య కాబడ్డ మహిళ బూసిపల్లి శివమ్మ (వయస్సు 27 సం.) భర్త వెంకటరమణ, జంగాలపల్లి వేంపల్లి పంచాయతీ, మదనపల్లి మండలం గా గుర్తించారు, మదనపల్లి టౌన్, ఈశ్వరమ్మ కాలనీకి చెందిన సంతోష్ అనే వ్యక్తితో వేల్లిపోయిందన్న కారణముతో ఆమె మీద కక్ష పెంచుకొని, ముద్దాయిలు ఆమె కాళ్ళు, చేతులను తాళ్లతో బంధించి, త్రాడు గొంతుకు బింగించి చంపేసి, ఎటువంటి ఆధారాలు లేకుండా చేయుటకు, చనిపోయిన మహిళపైన పెట్రోల్ పోసి నిప్పంటించి అతి భయంకరంగా, అత్యంత కిరాతకంగా.. హత్య చేసిన కేసును, మదనపల్లి రూరల్ సర్కిల్ పోలీసులు చేధించారు. మదనపల్లి డిఎస్పీ యస్, మహేంద్ర, మదనపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ ఏ, సత్యనారాయణ, రామసముద్రం యస్ఐ. జి.రవికుమార్ మరియు వారి సిబ్బంది చాకచక్యంగా ముగ్గురు ముద్దాయిలను రామసముద్రం తాసిల్దార్ కార్యాలయం దగ్గర అరెస్టు చేశారు. వారు నిన్నటి దినం అనగా 18.05.2025 సా.5.00 గం.లకు రామసముద్రం విఆర్ఓ సమక్షంలో నేరం ఒప్పుకొని అరెస్టు కాబడ్డారు. అరెస్టు చేసిన ముద్దాయిల వివరాలు.(1) యం. నీలావతి (వయసు 37 సం.) భర్త మునేష్ , కులం ఏకిల నాయుడు, దొమ్మసంద్ర, బెంగళూరు కర్ణాటక రాష్ట్రం, స్వస్థలం జంగాలపల్లి వేంపల్లి పంచాయతీ మదనపల్లి మండలం అన్నమయ్య జిల్లా. (2) కన్నె మడుగు గణేష్ (వయసు 25 సం.లు) తండ్రి. నాగరాజు, కులం ఏకిల నాయుడు, గుండే వారిపల్లి, నడింపల్లి పంచాయతీ, రామసముద్రం మండలం అన్నమయ్య జిల్లా. (3) హెచ్.వి.గోపాల్ (వయసు 42 సం.లు) తండ్రి లేట్, వెంకటస్వామి, కులం యస్సీ/మాల, డోర్ నెంబర్ 244, అంబేద్కర్ కాలనీ బి.హోసహళ్ళి, సజ్జాపురం, బెంగుళూరు కర్ణాటక రాష్ట్రం. పై ముగ్గురిని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన రెండు లీటర్ల పెట్రోల్ బాటిల్స్ రెండింటిని, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనపరచుకోవడం జరిగింది, ముద్దాయిలను స్వాధీన పరుచుకున్న వస్తువులను పుంగనూరు న్యాయస్థానం వారి ముందు హాజరు పరుస్తాం. ఎటువంటి ఆధారాలు, ఆనవాళ్లు లేకుండా వివాహిత మహిళను హత్య చేసిన దుండగులను అతి చాకచక్యంగా, టెక్నికల్ టీం, డాగ్ స్క్వాడ్ వారి సహకారంతో కేసును చేధించడం జరిగిందని, అతి తక్కువ సమయంలో ఈ కేసు ఛేదించిన మదనపల్లి డిఎస్పి, మదనపల్లి రూరల్ సీఐ, రామసముద్రం ఎస్ఐ, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు అభినందించారు.