
ముఖ్యమంత్రి చంద్రబాబు కు రూ.10 లక్షల చెక్ అందజేత
పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,మే 31:-
పుట్టపర్తి నియోజవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలుగుదేశం పార్టీకి తన వంతు విరాళంగా 10 లక్షల రూపాయల చెక్కును పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు అందజేశారు.కడప లో జరిగిన రాష్ట్ర మహానాడు వేదిక సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పార్టీకి రూ.10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించి అందుకు సంబంధించిన చెక్కును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అందజేశారు.