
లక్కిరెడ్డిపల్లి జనసముద్రం న్యూస్ జూన్ 4
మండలంలో ఎక్కడ గాని ప్రభుత్వ భూములు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే కఠి నుంచి తప్పవని తాసిల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం లక్కిరెడ్డిపల్లి పొలంలోని 705 సర్వే నెంబర్లు2.2 ఎకరాల భూమిలో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 705 సర్వేనెంబర్ లో 2.2 ఎకరాల భూమిని సూర్యనారాయణ రెడ్డికి అనే వ్యక్తికి డికేట్ భూమి ప్రభుత్వం ఇచ్చిందని అయితే ఈ భూమిని ఇప్పటికే ముగ్గురికి విక్రయించారని ప్రభుత్వం ఇచ్చిన డీ కెట్ భూమిని ఎవరికి విక్రయించకూడదని చట్టప్రకారం డికెటు పట్టా భూమిని వీరు ఇతరులకు విక్రయించడంతో ప్రభుత్వము ఆ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు అంతేకాకుండా మండలంలో ఎక్కడైనా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ మదన్ మోహన్ రెడ్డి, ఆర్ఐ రాజేష్,విఆర్ఓ కృష్ణయ్య మరియు రెవెన్యూ సిబ్బంది,పోలీసులు పాల్గొన్నారు