వృద్ధులు మరియు దివ్యాంగులు రేషన్ షాపులకు రావలసిన అవసరం లేదు…..

Spread the love

65 సంవత్సరాల పైబడిన వారికి, మరియు దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ….

65 సంవత్సరాల వయసు పైబడిన మరియు వికలాంగుల కార్డులలో 03 రోజులలోనే 57.79 శాతం కార్డులకు రేషన్ సరుకుల పంపిణీ….

….జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

రాయచోటి, జన సముద్రం న్యూస్ జూన్ 04:

65 సంవత్సరాల పైబడిన వారికి, మరియు దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ జరుగుతుందని, వారు రేషన్ షాపుల వద్దకు రావాల్సిన అవసరం లేదని అన్నమయ్య జిల్లాలో జూన్ మాసం మొదటి 03 రోజులలోనే వికలాంగులు మరియు 65 సంవత్సరాల పైబడిన వారి మొత్తం కార్డులలో 57.79 శాతం కార్డులకు రేషన్ సరుకుల పంపిణీ పూర్తయిందన్నారు.

మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లాలో చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ పై పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ….. అన్నమయ్య జిల్లాలో మొత్తం 1123 చౌక ధరల దుకాణాలు ఉన్నాయని, మొత్తం రేషన్ కార్డులు 4,97,969 ఉన్నాయని, మొత్తం రేషన్ కార్డుల ద్వారా 14,82,094 మంది సభ్యులు రేషన్ ద్వారా లబ్ది పొందనున్నారని పేర్కొన్నారు. ఇందులో 65 సంవత్సరాల పైబడిన కార్డుల సంఖ్య 53,707 గా ఉందని, ఈ కార్డుల ద్వారా 69,336 మంది సభ్యులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. ప్రతినెల 01 నుండి 15 తారీకు వరకు ఉదయం 08 నుండి 12 గంటల వరకు సాయంత్రం 04 నుండి 08 గంటల వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. ఏక లేదా ద్విసభ్య కార్డులలోని వారి వయస్సు 65 సంవత్సరాల పైబడి వారికి, దివ్యాంగులకు వారి ఇంటి వద్దనే రేషన్ పంపిణీ ఒకటో తేది నుండి 05 వతేది వరకు 12 గంటల నుండి 4 గంటల మద్య సమయములో పంపిణి చేయబడుతుందన్నారు.
వృద్ధులు మరియు దివ్యాంగులు రేషన్ షాపులకు రావలసిన అవసరం లేదు…..
65 సంవత్సరాల పైబడిన వృద్ధులు మరియు దివ్యాంగుల ఉద్దేశించి మాట్లాడుతూ వీరెవ్వరు రేషన్ షాపులకు రావాల్సిన అవసరం లేదని రేషన్ డీలర్ వారి ఇంటి వద్దకు రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేస్తారని పేర్కొన్నారు. వృద్ధులకు మరియు దివ్యాంగులకు ప్రతి నెల మొదటి 05 రోజుల లోపే రేషన్ సరుకుల పంపిణీ పూర్తి కానుందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రఘురాం, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్