మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో 13 లక్షలు పోగొట్టుకున్న లేడీ డాక్టర్..!!

Spread the love

జనసముద్రం న్యూస్,మే 28:

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని అపరిచితులను నమ్మకూడదని పోలీసులు ఎంతలా చెప్పినా ఎక్కడో ఓ దగ్గర ఎవరో ఒక్కరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ వైద్యురాలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. రూ.13 లక్షలు పోగొట్టుకుంది. వాట్సాప్లో పరిచయమైన సదరు నిందితుడు నైజీరియన్ గా తెలిసింది.

చత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్ కు చెందిన వైద్యురాలు పెళ్లి కోసం మ్యాట్రిమోనియల్ సైట్ లో నమోదు చేసుకుంది. తన పూర్తి వివరాలు నమోదు చేసింది. ఈ సైట్లో కొందరు నైజీరియన్లు నకిలీ ఫొటో వివరాలతో నమోదు చేసుకున్నారు. సదరు వైద్యురాలిని గుర్తించిన నైజిరియన్ సైట్లో ఉన్న ఆమె నెంబరు సేకరించి తనకు తాను వికాస్ కుమార్ గా పరిచయం చేసుకుంటూ వాట్సాప్ సందేశం చేశాడు. తాను కూడా డాక్టరేనని విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని త్వరలో ఇండియా వచ్చి పెద్ద ఆస్పత్రి పెట్టబోతున్నానని చెప్పాడు.

ఇక అప్పటి నుండి వాట్సాప్ సందేశాలు పంపించాడు. ప్రస్తుతం స్కాట్లాండ్లో ఉంటున్నానని వికాస్ చెప్పాడు. ఈ విషయాలను నమ్మిన వైద్యురాలు నైజీరియన్ తో చాటింగ్ చేయసాగింది. ఇలా వీరిద్దరి మధ్య పరిచయం పెళ్లి దాకా వెళ్లింది. ఓ రోజు వైద్యురాలి పుట్టినరోజు సందర్భంగా నిందితుడు ఆమెకు ఫోన్ చేసి పెళ్లి ప్రపోజ్ చేశాడు. పుట్టినరోజు కానుక పంపుతున్నానని స్వీకరించాలని ఆమెను కోరాడట.

ఆ తర్వాత కొద్ది సేపటికి వైద్యురాలికి కాల్ వచ్చింది. కష్టమ్ డిపార్టుమెంట్ నుంచి మాట్లాడుతున్నానని స్కాట్లాండు నుంచి బహుమతి వచ్చిందని చెప్పారు. ఆ బహుమతి మీకు చేరాలంటే రూ.35 వేలు చెల్లించాలని చెప్పాడట. దీంతో అపరిచితుని ఖాతాలో రూ.35 వేలు జమ చేసింది. మరుసటి మరో కాల్ వచ్చింది. స్కాట్లాండ్ నుంచి వచ్చిన పార్శిల్లో విదేశీ కరెన్సీ ఉందని అందుకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారట. దీంతో ఆమె మరో 50 వేల రూపాయలు పంపింది.

ఇలా పలు కారణాలు చెబుతూ స్కాట్లాండ్ బహుమతి చాలా విలువైనది ఆశ చూపుతూ వైద్యురాలి నుంచి మొత్తం రూ.13 లక్షలు కాజేసిన నిందితుడు ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. మోసపోయానని తెలుసుకున్న వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు ముగ్గురు నైజీరియన్లను అరెస్టు  చేశారు. వీరు దేశవ్యాప్తంగా ఇప్పటికే 19 మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని అపరిచితులను నమ్మకూడదని పోలీసులు ఎంతలా చెప్పినా ఎక్కడో ఓ దగ్గర ఎవరో ఒక్కరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ వైద్యురాలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. రూ.13 లక్షలు పోగొట్టుకుంది. వాట్సాప్లో పరిచయమైన సదరు నిందితుడు నైజీరియన్ గా తెలిసింది.

చత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్ కు చెందిన వైద్యురాలు పెళ్లి కోసం మ్యాట్రిమోనియల్ సైట్ లో నమోదు చేసుకుంది. తన పూర్తి వివరాలు నమోదు చేసింది. ఈ సైట్లో కొందరు నైజీరియన్లు నకిలీ ఫొటో వివరాలతో నమోదు చేసుకున్నారు. సదరు వైద్యురాలిని గుర్తించిన నైజిరియన్ సైట్లో ఉన్న ఆమె నెంబరు సేకరించి తనకు తాను వికాస్ కుమార్ గా పరిచయం చేసుకుంటూ వాట్సాప్ సందేశం చేశాడు. తాను కూడా డాక్టరేనని విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని త్వరలో ఇండియా వచ్చి పెద్ద ఆస్పత్రి పెట్టబోతున్నానని చెప్పాడు.

ఇక అప్పటి నుండి వాట్సాప్ సందేశాలు పంపించాడు. ప్రస్తుతం స్కాట్లాండ్లో ఉంటున్నానని వికాస్ చెప్పాడు. ఈ విషయాలను నమ్మిన వైద్యురాలు నైజీరియన్ తో చాటింగ్ చేయసాగింది. ఇలా వీరిద్దరి మధ్య పరిచయం పెళ్లి దాకా వెళ్లింది. ఓ రోజు వైద్యురాలి పుట్టినరోజు సందర్భంగా నిందితుడు ఆమెకు ఫోన్ చేసి పెళ్లి ప్రపోజ్ చేశాడు. పుట్టినరోజు కానుక పంపుతున్నానని స్వీకరించాలని ఆమెను కోరాడట.

ఆ తర్వాత కొద్ది సేపటికి వైద్యురాలికి కాల్ వచ్చింది. కష్టమ్ డిపార్టుమెంట్ నుంచి మాట్లాడుతున్నానని స్కాట్లాండు నుంచి బహుమతి వచ్చిందని చెప్పారు. ఆ బహుమతి మీకు చేరాలంటే రూ.35 వేలు చెల్లించాలని చెప్పాడట. దీంతో అపరిచితుని ఖాతాలో రూ.35 వేలు జమ చేసింది. మరుసటి మరో కాల్ వచ్చింది. స్కాట్లాండ్ నుంచి వచ్చిన పార్శిల్లో విదేశీ కరెన్సీ ఉందని అందుకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారట. దీంతో ఆమె మరో 50 వేల రూపాయలు పంపింది.ఇలా పలు కారణాలు చెబుతూ స్కాట్లాండ్ బహుమతి చాలా విలువైనది ఆశ చూపుతూ వైద్యురాలి నుంచి మొత్తం రూ.13 లక్షలు కాజేసిన నిందితుడు ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. మోసపోయానని తెలుసుకున్న వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు ముగ్గురు నైజీరియన్లను అరెస్టు  చేశారు. వీరు దేశవ్యాప్తంగా ఇప్పటికే 19 మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

  • Related Posts

    గ్యాంగ్ రేప్.. హత్య.. దేశానికీ సిగ్గు చేటు :అల్లెం కోటి.

    Spread the love

    Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,మణుగూరు, జూలై 21. మణిపూర్ లో మెజారిటీ వర్గమైనమైతేయిన్ లు, మైనార్టీలైన కుకీ గిరిజనులకు మధ్య హింస పేట్రేగిన మే 3వ తేదీ తర్వాతి రోజే ఈ ఘటన జరిగినట్లు…

    యూనిఫాం సివిల్ కోడ్ యూసీసీ అమలు దిశగా కేంద్రం మరో ముందడుగు..ఇక పై ముస్లింలు ,హిందువులు,ఇతరులు అందరికీ ఒకటే చట్టం..!

    Spread the love

    Spread the loveజనసముద్రం న్యూస్,జూలై 7: ఒక దేశం.. ఒక చట్టం దిశగా మోడీ సర్కారు అడుగులు వేయటం తెలిసిందే. ఒకే దేశంలోని ప్రజలకు మతాల వారీగా చట్టాలు ఉండటం ఏమిటి? అందరికి ఒకే చట్టం ఎందుకు ఉండకూడదన్న వాదనకు తగ్గట్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు