జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,మణుగూరు, జూలై 21.
మణిపూర్ లో మెజారిటీ వర్గమైన
మైతేయిన్ లు, మైనార్టీలైన కుకీ గిరిజనులకు మధ్య హింస పేట్రేగిన మే 3వ తేదీ తర్వాతి రోజే ఈ ఘటన జరిగినట్లు ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం (ఐటీఎల్ఎఫ్) ఆరోపించిందని, బాధిత మహిళలు కుకీ-జో ఆదివాసీ తెగకు చెందినవారని ఐటీఎల్ఎఫ్ వెల్ల డించింది.మే 4న మైతేయిన్ లు అత్యంత పాశవికంగా కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించారు.ఆ తర్వాత వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గుర్తింపు తెలిసేలా ఉద్దేశపూర్వకంగా వీడియోను విడుదల చేశారని మహిళా కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్ ఈ ఘటనపై స్పందించి దోషులను వెంటనే చట్ట ప్రకారం ఉరితీయాలని డిమాండ్ చేశారు.అడవి ప్రాంతంలో నివసించే ఆదివాసీ ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసారు. బహుజనులకు బీఎస్పీ పరిపాలనలో రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. దోషులకు శిక్ష పడే వరకు పోరాడుతామని తెలిపారు.