జనసముద్రం న్యూస్,మే 28
ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆన్లైన్ గుప్పిట్లో కి వెళ్లిపోయింది. మంచి నీళ్ల నుంచి తినే ఆహారం వరకు.. కూర్చున్న చోటకు చిటికెలో తెప్పించుకునే సౌకర్యాలు వచ్చేశాయి. ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వడం ద్వారా.. అనేక సేవలు ప్రజల కు చేరువ అయ్యాయి. దీంతో చేతిలోని స్మార్ట్ పోన్లో ఆర్డర్లు కుమ్మరిస్తూ… కూర్చు న్న చోటకే తెప్పించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక ఈ జాబితాలో ఔషధాలు కూడా చేరిన విషయం తెలిసిందే.
ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఇంటికే ఔషధాలు తెప్పించుకునే సౌకర్యం ఉంది. దీనిని కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. కరోనా సమయంలో ఈ సౌకర్యం ఎంతో ఉపయుక్తంగా మారింది. అయితే.. ఇక పై ఈ సేవల పై నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇలా ఆన్లైన్ ఆర్డర్ల లో నకిలీ ఔషధాలు.. వినియోగదారుల కు చేరుతున్నాయని.. దీంతో ప్రాణాల మీదకే సమస్య వస్తోందని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తోం ది.ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సహా కేంద్ర కేబినెట్ సెక్రటరీకి కెమిస్ట్స్ డ్రగ్టిస్ట్స్ ఆర్గనైజేషన్ లేఖ రాసింది. ఆన్లైన్ లో మందుల కొనుగోలు ను నిషేధించాలని ఏఐఓసీడీ డిమాండ్ చేసింది. ఆన్లైన్ మెడిసిన్ విక్రేతలు మందుల కొనుగోలు నిబంధనలను సరిగ్గా పాటించడం లేదని దీంతో ప్రజలు ఆన్లైన్ లో మందులు కొనుగోలు చేస్తూ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారని తెలిపింది.
ఇదిలావుంటే ఆన్లైన్ లో ఔషధాల ఆర్డర్లు కొనుగోళ్లపై గతంలోనే ఢిల్లీ హై కోర్టు నిషేధం విధించింది. హైకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ.. ఈ-ఫార్మసీలు లైసెన్స్ లేని మందులను ఆన్లైన్లో విక్రయించడాన్ని నిషేధిస్తూ 2018 ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను లేఖలో ఉదహరించారు. అయితే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అనేక ఈ-ఫార్మసీలు ఆన్లైన్ లో మందుల విక్రయాన్ని కొనసాగించాయి. ఈ క్రమంలో తాజా లేఖ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.