జనసముద్రం న్యూస్,జూన్ 4:
సంచలన నిర్ణయాన్ని తీసుకుంది భారత ప్రభుత్వం. దేశీయంగా అందుబాటులో ఉన్న 14 రకాల ఔషధాల్నిబ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పద్నాలుగు మెడిసిన్స్ జనరల్ ఇన్ఫెక్షన్లు.. దగ్గు.. జ్వరానికి ఉపయోగించే మెడిసిన్స్ కావటం గమనార్హం. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగానే తాజా బ్యాన్ వేసినట్లుగా చెబుతున్నారు. ఈ పద్నాలుగు ‘ఎఫ్ డీసీ’ మెడిసిన్స్ గా పేర్కొన్నారు.
ఇంతకు ఎఫ్ డీసీ మెడిసిన్స్ అంటే ఏమిటి? అంటే.. ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్.. అంటే స్థిర నిష్పత్తిలో రెండు లేదంటే అంతకు మించి క్రియాశీల ఫార్మాస్యూటికల్ పదార్థాలు కలిగి ఉన్న ఔషధాలుగా చెప్పాలి. ఈ తరహా మెడిసిన్స్ మీద గతంలోనూ బ్యాన్ విధించింది భారత ప్రభుత్వం. తాజగా నిషేధిత జాబితాలోకి చేర్చిన ఈ పద్నాలుగు మెడిసిన్స్ లో ముఖ్యమైన వాటి వివరాల్లోకి వెళితే..
1. నిమోసులైడ్+పారాసెటలమాల్ డిస్ పర్సిబుల్ మాత్రలు
2. క్లోర్ ఫెనిరమైన్ మలేట్+ కోడైన్ సిరప్
3. ఫోలో కోడిన్ + ప్రొమెథాజైన్
4. అమోక్సిసిలిన్ + బ్రోమ్ హెక్సిన్
5. బ్రోమ్ హెక్సిన్ + డెక్ట్ర్సో మెథోర్ఫాన్+ అమ్మోనియం క్లోరైడ్ + మెంథాల్
6. పారాసెటలమాట్ + బ్రోమ్ హెక్సిన్ + ఫినైల్ ఫ్రైన్ + క్లోర్ ఫెనిరమైన్ + గుయిఫెనెసిన్
7. సాల్బుటమాల్ + బ్రోమ్ హెక్సిన్
ఇప్పటిమాదిరే 2016లో కూడా 344 కాంబినేషన్ ఔషధాల తయారీ.. అమ్మకాల మీదా నిషేధానని విదించారు. శాస్త్రీయ సమాచారం లేకుండా ఈ మందులను రోగులకు అమ్మటంతోనే ఈ చర్యను తీసుకున్నారు. ఇక.. ఇప్పటి పరిస్థితికి వస్తే.. ప్రస్తుతం బ్యాన్ చేసిన 14 ఎఫ్ డీసీ మందులు కూడా గతంలో బ్యాన్ విధించిన 344 జాబితాలో ఉన్నవే కావటం గమనార్హం.