జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 18
(అందోల్ నియోజకవర్గం ఇంచార్జ్ జనార్దన్ )
మునిపల్లి మండల ఉన్నత పాఠశాలలో పలు గ్రామాలలో పదవ తరగతి చదివే బాల బాలికలకు రెండు వందల రూపాయలు పరీక్ష పీజు అని ఉపాధ్యాయ బృందం వసూలు చేస్తున్నారు. తీసుకోవాల్సింది నూట ఇరవై ఐదు రూపాయలు ఐతే ,కాయకష్టం చేసుకొని ఇచ్చే రూపాయలు అని,పేరుగాంచిన పాఠశాల లలో మావద్ద చదివించే స్తొమత లేక ప్రభుత్వ పాఠశాల లో చదివిస్తే రెక్కాడితే కాని డొక్కాడని మా బ్రతుకులు మావద్ధ అదనంగా వసూలు చేయడం చాలా బాధ కరమని విద్యార్థుల తల్లితండ్రులు బాధపడుతున్నారు
ఇకపోతేకొన్నిపాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏంచేస్కుంటారో చేసుకోమని సి ఆర్ పి, విద్యావాలంటీర్ లతో విలేకరులకు బెదిరింపులు చేయడం సరి కాదని బీజేపీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ హెచ్చరించారు. వెంటనే ఈ విషయాన్ని డి.ఇ. ఓ. రాజేష్ పరిష్కరించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ ఓటు బ్యాంకు కోసమే కాదు ప్రతీ విషయాన్ని పరిశీలిస్తుందని మునిపల్లి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ గుర్తు చేశారు.