మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్:మార్చ్ 31
శామీర్ పేట లో గురువారం రాత్రి శ్రీ రామ నవమి సందర్భంగా జరిగిన శోభ యాత్ర లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు పండుగలను సామరస్య పూర్వకంగా జరుపుకునే ఏకైక దేశం భారతదేశమని ప్రతి ఒక్కరు అన్న దమ్ములవలే కలసి ఉంటారని అన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం లో అనాది కాలం నుండి ప్రాచుర్యం పొందిన గంగా జమున కల్చర్ మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. శోభా యాత్ర లో అఫ్జల్ ఖాన్ తో పాటు శామీర్ పేట ఎస్ఐ రవికుమార్, పవన్ ముదిరాజ్, రైతు సహాకార సంఘం మాజీ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.