జనసముద్రం న్యూస్,జనవరి 5:
కరోనా సమయంలో ఐటీ.. బడా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించాయి. దీంతో తమ ఉద్యోగానికి ఢోకా లేదని వారంతా భావించారు. అయితే కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత కంపెనీలు ఉద్యోగులను వరుసబెట్టి తొలగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.2022 లో న్యూయార్క్ వ్యాలీలోని బడా ఐటీ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు తొలగించాయి. మెటా.. అమెజాన్.. ట్విట్టర్.. ప్రముఖ కంప్యూటర్ తయారీ సంస్థలు హెచ్పీ.. డెల్ వంటి కంపెనీలు ఉండటం విశేషం. రాబోయే రోజుల్లో ఉద్యోగుల తొలగింపు తప్పదనే సంకేతాలను ఆయా కంపెనీలు ముందుగానే పంపించాయి.గత కొన్నిరోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు విరామం ప్రకటించిన ఐటీ తదితర కంపెనీలు 2023 ప్రారంభంలో మళ్లీ తొలగింపులకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు అమెజాన్ కంపెనీ సుమారు 18 వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. దీని ప్రభావం అమెజాన్ స్టోర్స్.. పీపుల్.. ఎక్స్ పీరియన్స్ అండ్ టెక్నాలజీలపై పడుతుందని భావిస్తున్నారు.
ఈ విషయంపై అమెజాన్ సీఈఓ ఒక ప్రకటనలో స్పందిస్తూ.. ముందుగా పేర్కొన్న విధంగా వార్షిక ప్రణాళిక ప్రక్రియ పూర్తి చేయలేదన్నారు. 2023 ప్రారంభంలో మరింత మంది ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 18 నుంచి ప్రభావితమైన ఉద్యోగులతో కమ్యూనికేట్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.కాగా గత నవంబర్ల్లో ఇ-కామర్స్ బెహెమోత్ తన శ్రామిక శక్తిని దాదాపు 10 వేల మంది తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని నివేదికలు వెలువడ్డాయి. 2022 సెప్టెంబర్ కంపెనీలో మొత్తం 1.5 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించింది. మేటా గతేడాది 11వేల ఉద్యోగులను తొలగించింది. అయితే చిప్ మేకర్.. ఇంటెల్ ఈ ఏడాదిలో గణనీయంగా ఉద్యోగుల్లో కోతలు పెట్టేందుకు సిద్ధమైంది.
గూగుల్ సైతం 2023 ప్రారంభంలోనే ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. అలాగే ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్ఫోర్స్ 7వేల మందికి పైగా ఉద్యోగులపై తొలగించే అవకాశం ఉందని. కంపెనీలో పని చేసే మొత్తం ఉద్యోగుల్లో 10శాతం మేరకు ఉద్యోగులను తొలగించేందుకు సేల్స్ ఫోర్స్ సిద్దమైంది.ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో ఉద్యోగులకు రాసిన లేఖలో పర్యావరణం “సవాలు”గా ఉందని తెలిపారు. కంపెనీ కస్టమర్లు.. వారి కొనుగోలు నిర్ణయాల ఆధారంగా రాబోయే వారాల్లో కంపెనీ ఉద్యోగుల తగ్గింపు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇది చాలా కష్టమైన నిర్ణయమని సేల్స్ ఫోర్ సీఈవో బెనిరూఫ్ పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో కంపెనీలో నియామకం అయినవారు తక్కువ ఉత్పాదకతను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
ఇక సేల్స్ఫోర్స్ నుంచి నిష్క్రమించే వారికి ఉదారమైన ప్యాకేజీ అందించేందుకు కంపెనీ సిద్ధవుతోంది. బాధిత ఉద్యోగులకు సుమారు ఐదు నెలల జీతం ఆరోగ్య బీమా.. కెరీర్ వనరులు ఇతర ప్రయోజనాలను కంపెనీ అందించనుంది. 2022 ప్రారంభంలో కంపెనీ పేరోల్లో 73541 మంది ఉండగా గతేడాది వెయ్యి కంటే తక్కువ మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే 10శాతం ఉద్యోగులను తొలగించేందుకు సేల్స్ ఫోర్స్ సిద్ధమవుతోంది.