మాకు అధికారమిస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేస్తాం : ఏపి ప్రజలకు కెసిఆర్ బీఆర్ఎస్ హామీ..!

Spread the love

తెలంగాణ ముఖ్యమంత్రి  భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్.. తాజాగా ఏపీలోనూ విస్తరిం చాలని నిర్ణయించుకున్నారు. తన తొలి అడుగు ఏపీలోనే వేయనున్నట్టు ఆయన చెప్పేశారు.తాజాగా కొందరిని పార్టీలోకి సైతం ఆహ్వానించారు. అయితే.. సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఏపీకి సంబంధించిన సమస్యలపై ఆయన స్పందించారు.

“మాకు అధికారమిస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేస్తాం” అని కేసీఆర్ ప్రకటించారు. కొన్ని వేల కుటుంబాలు ఆ సంస్థపై ఆధారపడి బతుకుతున్నాయని చెప్పారు. ఒకవేళ.. విశాఖ ఉక్కును మోడీ అమ్మి తే.. తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే.. విశాఖ ఉక్కును తిరిగి ప్రభుత్వరంగంలోకి తెస్తామని తెలిపారు.నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయన్న కేసీఆర్.. చెన్నై వంటి నగరాలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నాయని తెలిపారు.  దేశ రాజధాని ఢిల్లీలో కూడా సరిపడా నీళ్లు దొరకటం లేదని.. ఇప్పటికీ కరెంట్ కోతలు ఉన్నాయని వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా నీరు విద్యుత్ సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని కేసీఆర్ ఆరోపించారు.

కట్ చేస్తే.. ఏపీకి సంబంధించిన సమస్యలను ప్రస్తావించిన కేసీఆర్.. ముఖ్యంగా విశాఖ ఉక్కు విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. అదే నోటితో ప్రత్యేక హోదా విషయాన్ని కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదని.. అంటున్నారు  పరిశీలకులు. అంతేకాదు.. జల వివాదాను ప్రస్తావించిన కేసీఆర్.. అదే సమయంలో ఏపీ-తెలంగాణ జల వివాదాలను కూడా తాను పరిష్కరిస్తానని చెప్పి ఉంటే.. ఆయన విశ్వసనీయత మరింత పెరిగేదని చెబుతున్నారు.

ఏదేమైనా.. కేసీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ శక్తిగా మారుతారనే నమ్మకం ఏపీ ప్రజలకు కలిగితే.. ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. లేకపోతే.. ఉత్తుత్తి ఊరేగింపులానే ఉంటుందని చెబుతున్నారు.

Related Posts

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

Spread the love

Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

Spread the love

Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి