పొలిటికల్ హీట్..తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఎవరు సపోర్ట్.??

Spread the love
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 18:

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ సెగ బాగానే ఉంది. అధికార పార్టీలు మళ్లీ తమ పంతం నెగ్గించుకు నేందుకు అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అయితే.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీల ఉనికి ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుండడం గమనార్హం. దీంతో అధికార పార్టీల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది?  ఎవరికెవరు తోడు..? ఎవరికెవరు నీడ? అనే చర్చ సాగుతోంది.

తెలంగాణ  పరిస్థితిని తీసుకుంటే.. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు రెండూ కూడా దూకుడుగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ జోరు కనిపిస్తోంది. పైగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు ప్రతిష్టాత్మకంగా కూడా భావిస్తున్నా రు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారం లోకి రావాలని కంకణం కట్టుకున్నట్టుగా వారి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ కూడా సంస్థాగతంగా లెక్కు మిక్కిలి ఇంచార్జులను నియమించి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ఏపీ పరిస్థితిని గమనిస్తే.. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో జోరు కూడా పెంచింది. అయితే వైసీపీకి దీటుగా టీడీపీ కూడా ప్రజల మధ్య ఉండేందుకు ప్లాన్ చేసుకుంది.వచ్చే జనవరినుంచి లోకేష్ పాదయాత్ర కూడా ప్రారంభిస్తున్నారు. ఇక మరోపార్టీ జనసేన కూడా దూకుడు పెంచింది. నాయకులు కార్యకర్తలతో సంబంధం లేకుండా.. పార్టీ అధినేత పవన్ ప్రచారానికి దిగుతున్నారు.
అంటే.. మొత్తంగా 2023లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు మరింత సలసల కాగనున్నాయి. ఈ క్రమంలో ఈ రెండు రాష్ట్రాల్లోని అధికారపార్టీలకు మధ్య అవగాహన కుదురుతుందా?  అనేది చర్చ. గత 2019 ఎన్నికల్లో కేసీఆర్.. జగన్కు సాయం చేశారనే వాదన ఉంది.
ఇక ఇప్పుడు జగన్ కూడా కేసీఆర్కు సాయం చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ సారి.. బీఆర్ ఎస్ పార్టీ పెట్టిన కేసీఆర్ తద్వారా.. జగన్కు కూడా వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చేలా రాజకీయ వ్యూహాలకు సిద్ధమవుతారనే చర్చసాగుతోంది. దీంతో  ఎవరికెవరు తోడు-నీడ?! అనే చర్చ హాట్గా మారింది.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి