చంద్రబాబు విజన్ వర్సెస్ జగన్ సంక్షేమం..గెలిచేదెవరు..??

Spread the love
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 18:

జగన్ సంక్షేమాన్ని నమ్ముకున్నారు. వచ్చే ఎన్నికల్లో అదే తనకు ఓట్ల వర్షం కురిపిస్తుంది అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఖజానా ఖాళీ అవుతున్నా తన తొలి ప్రాధాన్యతగా సంక్షేమానికి వేల కోట్లు కుమ్మరిస్తున్నారు. ప్రతీ గడపకూ తిరిగి సంక్షేమ గురించి చాటి చెప్పాలని ఎమ్మెల్యేలను పురమాయిస్తున్నారు. వై నాట్ 175 అంటూ జగన్ ధీమా పడుతోంది కూడా సంక్షేమ పధకాలను చూసుకునే అని అంటున్నారు.

ఇక చంద్రబాబు ఈ మధ్య దాకా తాను కూడా అదే సంక్షేమ కార్యక్రమాలతో కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఆయన జిల్లా టూర్లలో సైతం టీడీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం వైసీపీ సంక్షేమ పధకాలను పూర్తిగా అమలు చేస్తుంది. ఇంకా కొత్తవి కూడా మరెన్నో ప్రవేశపెడుతుంది అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే సంక్షేమం వర్సెస్ సంక్షేమం అన్నట్లుగానే ఇప్పటిదాకా వైసీపీ టీడీపీల మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది.
ఈ విషయంలో ప్రస్తుతానికి అయితే వైసీపీది పై చేయిగా ఉన్నట్లుగా కూడా అంచనాలు ఉన్నాయి. సంక్షేమం విషయంలో టీడీపీ ఎన్నికల ప్రణాళికతో వస్తే మార్పు ఉంటుంది అని అనుకుంటున్నారు. అయితే ఏపీలో సంక్షేమం తో పాటుగా తన మార్క్ అభివృద్ధిని జోడిస్తే తప్ప వైసీపీని దెబ్బ కొట్టలేమని తెలుగుదేశం అనుకుంటోంది. సరిగ్గా ఈ సమయంలో బాబు విజన్ కి హైదరాబాద్ లో నీరాజనం పట్టే సందర్భం వచ్చింది
బాబు ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవాలలో  ఆయనకు బ్రహ్మరధం పట్టారు. బాబు ఒకనాటి విజన్ ఈ నాటి డెవలప్మెంట్ అని కూడా నిర్వాహకులు కీర్తించారు. దాంతో ఇపుడు బాబు తన వ్యూహం మార్చుకుంటున్నారు అని అంటున్నారు. మరో మారు తన మార్క్ విజన్ కి పదును పెట్టడం ద్వారా ఏపీలో జనాలను పూర్తిగా తిప్పుకోవచ్చు అని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
హైదరాబాద్ లో తాను నాటిన విత్తనాలు ఈ రోజు వృక్షాలుగా మారి మంచి ఫలితాలు ఇస్తున్నాయని బాబు చెప్పుకునే వీలు కలిగింది.హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని చూసి ఏపీ జనాలు తనకు ఓటేయాలని బాబు ఎన్నికల్లో కోరే అవకాశాలు ఉన్నాయి. అమరావతి రాజధానికి సాటి లేని మేటిగా తీర్చిదిద్దుతానని ఏపీని అద్భుతంగా నిలుపుతాను అని బాబు ఇక మీదట జరిగే ప్రచారంలో కొత్త స్టేట్మెంట్స్ ఇస్తారని అంటున్నారు.
నిజానికి బాబుకు మంచి దార్శనీకుడిగా పేరు ఉంది. అదే విధంగా బాబు పరిపాలనాదక్షుడిగా చూస్తారు. బాబు సైతం నాలుగున్నర పదుల వయసులో యువ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీకి వచ్చారు. ఆనాడు ఆయన తొమ్మిదేళ్ళ పాటు తనదైన శైలిలో ఏపీ రాజకీయాలను శాసించారు. సంస్కరణ పధంలో నడిపారు. అయితే 2004లో బాబు ఓడిపోవడంతో పాటు వైఎస్సార్ సంక్షేమ మంత్రాన్ని అందుకుని రెండు సార్లు సీఎం కావడంతో బాబు ఆలోచనలు కూడా మారాయని చెబుతారు
ఇక్కడే బాబు రాంగ్ స్టెప్ వేశారని అంటున్నారు. బాబు తన డెవలప్మెంట్ ని విజన్ ని తన సంస్కరణలను వీడకుండా అదే స్టాండ్ తో ఎన్నికలకు వెళ్తే ఆయనకు ఢోకా ఉండేది కాదని అంటారు. ఇపుడు కూడా జగన్ సంక్షేమం అంటే బాబు అటే వెళ్ళడం చాలా మందికి నచ్చడంలేదు. ప్రత్యేకించి ఏపీ అభివృద్ధి కోరుకునే వారు అంతా కూడా తప్పుపడుతున్నారు. ఇపుడు బాబు తనలోని విజనరీని తీసి జనం ముందు పెడితే తప్పకుండా ఏపీలో అది మంచి ఫలితాలను ఇస్తుందని విజన్ విషయంలో బాబుకు సాటి పోటీగా ఎవరూ ఉండే చాన్సే లేదని అంటున్నారు.
మొత్తానికి చూస్తే సంక్షేమంతో ఓట్ల పంట పండించుకుని మరోసారి సీఎం కావాలని చూస్తున్న జగన్ కి బాబు మార్క్ విజన్ అడ్డం తగిలితే మాత్రం భారీ షాక్ అనే చెప్పాలి. ఈ రోజుకు ఏపీ ఉన్న పరిస్థితుల్లో కావాల్సింది నగదు బదిలీ పధకాలు కాదు దార్శనీకతతో కూడా పరిపాలనా దక్షత అని అంతా అంటున్నారు. సో బాబు కొత్త గొంతు వినిపిస్తే మాత్రం వైసీపీకి చుక్కలే అంటున్నారు.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం