ఇంటి వద్దకు రేషన్ బియ్యం ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో

Spread the love

రేపు క్యాబినెట్ మీటింగ్ లో పూర్తిగా క్లారిటీ

పల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్, మే 20.

రేషన్ షాపులలో డీలర్ల ద్వారా బియ్యం తీసుకోవాలి..’ అనే వార్త సోషల్​మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. కానీ.. రేపు జరిగే క్యాబినెట్​సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు భావిస్తున్నారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికి రేషన్​అందించే విషయంపై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోవచ్చని కొద్దిరోజులుగా అంతా భావిస్తున్నారు. రెండు రోజుల కిందట మంత్రి నాదెండ్ల మనోహర్​దీనిపై స్పందించారు. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఆ నిర్ణయం ఏమిటి..? వాహనాలను కొనసాగిస్తారా..? లేక రేషన్​షాపుల్లో సరుకులు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో పలు మార్పులను తీసుకువచ్చింది. అయితే ఎండీయూ వాహనాల ద్వారా రేషన్​సరఫరాను మాత్రం యథాస్తితిగా కొనసాగించింది. కొద్దిరోజుల కిందట రేషన్​డీలర్లు, ఎండీయూ వాహనాల ఆపరేటర్లతో మంత్రి చర్చలు జరిపి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వాహనాల ద్వారా రేషన్​పంపిణీ సక్రమంగా జరగడం లేదని, అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయని, కాబట్టి రేషన్​సరఫరా తిరిగి తమకే అప్పగించాలని డీలర్లు కోరారు. వాహనాలు ఆపితే తాము నష్టపోతామని ఆపరేటర్లు తెలిపారు. అయితే ఎండీయూ వాహనాల వల్ల ప్రజలకు మేలు జరగకపోగా, ప్రభుత్వానికి అదనపు భారం అవుతోందనేది కూటమి పెద్దల అభిప్రాయం. ఈ క్రమంలో వాహనాల వ్యవస్థను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్