రేపు క్యాబినెట్ మీటింగ్ లో పూర్తిగా క్లారిటీ
పల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్, మే 20.
రేషన్ షాపులలో డీలర్ల ద్వారా బియ్యం తీసుకోవాలి..’ అనే వార్త సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. కానీ.. రేపు జరిగే క్యాబినెట్సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు భావిస్తున్నారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికి రేషన్అందించే విషయంపై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోవచ్చని కొద్దిరోజులుగా అంతా భావిస్తున్నారు. రెండు రోజుల కిందట మంత్రి నాదెండ్ల మనోహర్దీనిపై స్పందించారు. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఆ నిర్ణయం ఏమిటి..? వాహనాలను కొనసాగిస్తారా..? లేక రేషన్‌షాపుల్లో సరుకులు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో పలు మార్పులను తీసుకువచ్చింది. అయితే ఎండీయూ వాహనాల ద్వారా రేషన్సరఫరాను మాత్రం యథాస్తితిగా కొనసాగించింది. కొద్దిరోజుల కిందట రేషన్‌డీలర్లు, ఎండీయూ వాహనాల ఆపరేటర్లతో మంత్రి చర్చలు జరిపి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వాహనాల ద్వారా రేషన్పంపిణీ సక్రమంగా జరగడం లేదని, అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయని, కాబట్టి రేషన్సరఫరా తిరిగి తమకే అప్పగించాలని డీలర్లు కోరారు. వాహనాలు ఆపితే తాము నష్టపోతామని ఆపరేటర్లు తెలిపారు. అయితే ఎండీయూ వాహనాల వల్ల ప్రజలకు మేలు జరగకపోగా, ప్రభుత్వానికి అదనపు భారం అవుతోందనేది కూటమి పెద్దల అభిప్రాయం. ఈ క్రమంలో వాహనాల వ్యవస్థను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.





