
పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,ఏప్రిల్ 30 :-
జిల్లాలో పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లో ని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పెనుగొండ ఆర్డివో ఆనంద్,పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణ కదిరి ఆర్డీవో శర్మ, ధర్మ వరం ఆర్డివో మహేష్ మరియు సంబంధిత తహసిల్దారులతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించి అదనంగా భూ సేకరణ నిర్వహించడం జరిగింది.వాటికి సంబంధించిన రైతుల వివరాలు సేకరించిన భూమి లబ్ధిదారులకు నష్టపరిహారం త్వరితగతిన నష్ట పరిహారం అందించే విధిగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.వీలైనంత ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్ హెచ్ 716 (జి) బి.కొత్తకోట నుండి గోరంట్ల,గోరంట్ల నుండి హిందూపూర్,ప్యాకేజ్ నెంబర్ 2,టుఎన్ హెచ్ 544 బెంగళూరు –కడప విజయవాడ,ఎన్ హెచ్ 342 ముదిగుబ్బ – పుట్టపర్తి,పుట్ట పర్తి నుండి కోడూరు,ఎన్ హెచ్ 42 బత్తలపల్లి -ముదిగుబ్బ, ఎన్ హెచ్ 42 కదిరి కి సంబంధించి ఇప్పటివరకు జరిగిన భూ సేకరణ వివరాలు పెండింగ్ పనులపై జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. ముఖ్యంగా భూసేకరణ పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా త్వరగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని,అలాగే నష్టపరిహారాన్ని అందించడంలో ఎలాంటి జాప్యం లేకుండా రైతు లబ్ధిదారులకు అందించాలని సూచించారు.భూసేకరణ లో భాగంగా మంజూరైన నష్టపరిహారం అందించడంలో ఏమైనా కుటుంబ కోర్టు కేసులు పెండింగ్ ఉన్నట్లయితే వాటన్నింటినీ కోర్టులో డిపాజిట్ చేయుటకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా అదనంగా సేకరించినటువంటి భూములకు గ్డ్రాఫ్ట్ అవార్డులు సిద్ధం చేయాలని ఆదేశించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భూమిని సబ్ డివిజన్ చేసేటప్పుడు ఎమ్మార్వోలు జాగ్రత్తగా చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో ల్యాండ్ ఎక్కువైజేషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య పుట్టపర్తి తహసీల్దార్ కళ్యాణ్,కొత్తచెరువు డిటి బాల ఆంజనేయులు,హిందూపురము వెంకటేష్,తలపుల రెడ్డి శేఖర్,కదిరి మురళి కృష్ణ, డిటి మహబూబ్ బాషా, గోరంట్ల చిలమత్తూరు, ముదిగుబ్బ నారాయణస్వామి, బుక్కపట్నం ఎమ్మార్వో కే షబీనా,ఓడిసి,ధర్మవరం , మండలాల తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.