
అట్టహాసంగా యువ నాయకుడు గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు..!
భారీ బైక్ ర్యాలీతో యువత వేడుకలు..!
జనసముద్రంన్యూస్, , మాచర్ల :
మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తనయుడు, టిడిపి యువ నాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో మంగళవారం పొద్దుపోయే వరకు అట్టహాసంగా జరిగాయి. ముందుగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం పేట సన్నేగండ్ల లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌతమ్ రెడ్డికి కారంపూడి మండల నాయకులు, యువత ర్యాలీగా కారంపూడి పట్టణంలోకి ఘన స్వాగతంతో తోడ్కొని వచ్చారు. స్థానిక సుద్దగుంతల, ప్రధాన కూడళ్లలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకులను కట్ చేసి, అభినందనలు తెలిపారు. అనంతరం దుర్గి మండల కేంద్రం, ఎన్టీఆర్ విగ్రహం వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి, రాయవరం జంక్షన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి భారీ బైక్ ర్యాలీ, డీజే మోతల నడుమ మాచర్ల పట్టణ పురవీధుల్లో గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం స్థానిక సొసైటీ కాలనీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అభిమానులు సమక్షంలో భారీ కేక్ కట్ చేసి, కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన టిడిపి నాయకులు, యువత గౌతమ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.