
జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 29
ద్వారకా తిరుమల
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు, వచ్చే భక్తులకు పారిశుద్ధ్యం కరువు! ఈ దేవాలయంలో గతంలో సుమారుగా 130 మంది పని చేసేవారు, ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు! శానిటరీ సిబ్బందికి ప్రతి నెల లక్షల మీద జీతాలు ఇస్తున్నారు, అసలు ఇప్పుడు ఈ దేవాలయంలో ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారో ఈ దేవాలయం అధికారులకే తెలియాలి ఈ పారిశుద్ధ్యం సిబ్బంది భక్తులకు మద్యం సీసాలతో స్వాగతం పలుకుతున్నారు,
ఈ క్షేత్రంలో మద్యం సేవించి సెంటర్ పార్కింగ్ మరియు స్వామివారి ప్రసాదం తయారీ కేంద్రం ప్రాంతంలో మద్యం సేవించిన సీసాలు దర్శనమిస్తున్నాయి,
స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు,
గతంలో కూడా కొన్ని పత్రికలలో ప్రచురించినా దేవస్థానం అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు దీనిపై ఇంజనీర్ విభాగం మరియు భద్రత సిబ్బంది స్వామివారి ఆలయం పై దృష్టిపెట్టాలని భక్తులు ప్రశ్నిస్తున్నారు,
ఇది అలా ఉండగా స్వామివారి దేవస్థానం హైస్కూల్లో శానిటరీ సిబ్బంది, పట్టపగలే మద్యం సేవిస్తున్నారు, దీనిపై పత్రిక విలేకరు అడగ్గా నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పు మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని వాగ్వాదానికి దిగారు దీనిపై ఇంజనీరింగ్ విభాగం వారు మరియు దేవస్థానం అధికారి ఈవో ఏమి చర్య తీసుకుంటారో అనేది వేచి చూడాల్సి ఉన్నది ,
మరిన్ని వివరాలతో మీ జనసముద్రం న్యూస్